OnePlus 11 5G Price in India : ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ 11 5G సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే సేల్ డేట్ లీక్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus 11 5G Price in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. OnePlus 11R స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ OnePlus ఫోన్ ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

OnePlus 11 5G Price in India : ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ 11 5G సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే సేల్ డేట్ లీక్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus 11 5G Price in India and sale date leak ahead of February 7 launch

OnePlus 11 5G Price in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. OnePlus 11R స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ OnePlus ఫోన్ ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్ చేయడానికి కొద్ది రోజుల ముందు OnePlus 11 ధర, సేల్ డేట్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ కొత్త OnePlus 5G ఫోన్ రెండు కాన్ఫిగరేషన్‌లలో రానుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్విట్టర్‌లో రివీల్ చేశారు.16GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 61,999గా ఉంది. అంతేకాదు.. 8GB RAM మోడల్ కూడా అందుబాటులో ఉంది.

OnePlus 11 ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చింది. OnePlus 11 ఫోన్ బేస్ మోడల్ చైనాలో ప్రారంభ ధర (యువాన్ 3,999) ఉండగా, భారత మార్కెట్లో దాదాపు రూ. 48,900గా ఉంది. భారతీయ మార్కెట్లో వన్‌ప్లస్ 11 బేస్ మోడల్ ధర రూ. 60వేల లోపు ఉండవచ్చని అంచనా.

OnePlus 11 5G ముందస్తు సేల్ ఫిబ్రవరి 11న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సరసమైన ధరకు టాప్ ఫీచర్లను అందించడమే లక్ష్యంగా కంపెనీ భావిస్తోందని లీక్ డేటా సూచిస్తుంది. మరోవైపు శాంసంగ్ కంపెనీ Galaxy S23 సిరీస్ చాలా ఖరీదైనదిగా ఉంది. శాంసంగ్ ప్రామాణిక మోడల్ ఐఫోన్ 14 కన్నా ధర ఎక్కువగా ఉంటుంది.

OnePlus 11 5G Price in India and sale date leak ahead of February 7 launch

OnePlus 11 5G Price in India and sale date leak ahead of February 7 launch

Read Also : Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్.. మీకు నచ్చిన ప్లాన్ రీఛార్జ్ చేసుకోండి!

Galaxy S23 ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. శాంసంగ్ గెలాక్సీ S23 Ultra భారత మార్కెట్లో ధర రూ. 124,999గా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ల కన్నా సరసమైన ధరలో ఉండే OnePlus 11 ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ ఫోన్.. ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ ఫోన్ల కెమెరాలతో పోల్చి చూడొచ్చు.

OnePlus 11 కొన్ని రోజుల్లో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. చైనాలోని ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ హుడ్ కింద Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీతో పాటు కంపెనీ రిటైల్ బాక్స్‌లో 100W ఛార్జర్‌ను కూడా అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy S23 Series : అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ వచ్చేసిందోచ్.. మూడు ఫోన్ల ధర ఎంతో తెలుసా? ఇప్పుడే ప్రీ-బుకింగ్ చేసుకోండి..!