Realme 10 Pro Series : భారత్‌కు రియల్‌మి 10 ప్రో సిరీస్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Realme 10 Pro Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) ఎట్టకేలకు భారత మార్కెట్లో Realme 10 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో Realme 10 Pro, Realme 10 Pro ప్లస్ ఉన్నాయి. కొత్త సిరీస్ కర్వ్డ్ డిస్‌ప్లే, 108-MP కెమెరా సెన్సార్‌లతో వస్తుంది.

Realme 10 Pro Series : భారత్‌కు రియల్‌మి 10 ప్రో సిరీస్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Realme 10 Pro Plus and Realme 10 Pro launched in India, price starts at Rs 18,999

Realme 10 Pro Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) ఎట్టకేలకు భారత మార్కెట్లో Realme 10 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో Realme 10 Pro, Realme 10 Pro ప్లస్ ఉన్నాయి. కొత్త సిరీస్ కర్వ్డ్ డిస్‌ప్లే, 108-MP కెమెరా సెన్సార్‌లతో వస్తుంది. రియల్‌మి 10 ప్రో ప్లస్ (Realme 10Pro Plus) మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో అత్యంత సన్నని దిగువ బెజెల్‌లతో కర్వడ్ డిస్‌ప్లేతో వచ్చింది. మరోవైపు Realme 10 Pro ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లాగ్‌షిప్-స్థాయి డిస్‌ప్లేలు, పవర్‌ఫుల్ 5G ప్రాసెసర్‌లతో రానున్నాయి. భారత మార్కెట్లో 5G ప్రారంభమైన సమయంలో ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ నంబర్ సిరీస్ విజయవంతంగా చేరుకున్నామని కంపెనీ చెబుతోంది. అందులో 30 మిలియన్ల మంది యూజర్లు భారతీయ యూజర్లే ఉన్నారని తెలిపింది. రియల్‌మి 10 ప్రో సిరీస్ 5G కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టిందని కంపెనీ పేర్కొంది.

రియల్‌మి 10ప్రో ఫోన్ ధర ఎంతంటే? :
రియల్‌మి (Realme 10 Pro Plus) 6GB, 8GB వేరియంట్‌లతో సహా రెండు వేర్వేరు వేరియంట్‌లలో వచ్చింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. అయితే, బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డివైజ్ రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు. Realme 10 Pro Plus 8GB+128GB వేరియంట్‌ను రూ. 25,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ హైపర్‌స్పేస్ గోల్డ్, డార్క్ మేటర్, నెబ్యులా బ్లూతో సహా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : Realme 10 Pro : 108MP ప్రైమరీ కెమెరాలతో రియల్‌మి10ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే..?

మరోవైపు, Realme 10 Pro (6GB+128, 8GB+128GB)తో సహా రెండు వేరియంట్‌లలో కూడా వస్తుంది. గతంలో ఈ మోడల్ ధర రూ. 18,999కి లాంచ్ కాగా.. ఇప్పుడు ఈ డివైజ్ బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 17,999కి కొనుగోలు చేయవచ్చు. 8GB వేరియంట్ ధర రూ.19,999గా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హైపర్‌స్పేస్ గోల్డ్, డార్క్ మేటర్, నెబ్యులా బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. Realme 10 Pro Plus మొదటి సేల్ డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. అయితే Realme 10 Pro డిసెంబర్ 16 నుంచి Flipkartలో అందుబాటులో ఉంటుంది.

Realme 10 Pro Plus and Realme 10 Pro launched in India, price starts at Rs 18,999

Realme 10 Pro Plus and Realme 10 Pro launched in India

Realme 10 Pro : స్పెసిఫికేషన్‌లివే :

రియల్‌మి (Realme 10 Pro Plus) Full HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ USP కర్వ్డ్ డిస్‌ప్లే, రియల్‌మే సిరీస్‌లో మొదటిదిగా చెప్పవచ్చు. ప్రధానంగా మిడ్ రేంజ్ విభాగంలో డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. Realme 10 Pro Plus, MediaTek Dimensity 1080 SoCతో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్‌తో రానుంది. స్మార్ట్‌ఫోన్‌లో 108-MP ప్రైమరీ కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2-MP మాక్రో షూటర్ వంటి క్వాడ్-కెమెరా సిస్టమ్ ఉంది. సెల్ఫీల కోసం ఫోన్ 16-MP ఫ్రంట్ కెమెరాతో కూడా వస్తుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ఉన్నాయి.

రియల్‌మి 10 Pro 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేతో Full-HD రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Realme Pro 12GB RAM, 256GB స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 108-MP ప్రైమరీ కెమెరా, కేవలం 2-MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో ఒకే 16MP కెమెరా కూడా ఉంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉన్నాయి. Realme 10 Proలో మైక్రో SD కార్డ్ స్లాట్ లేదని చెప్పవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme 10 Pro+ : భారత్‌లో రూ.25 వేల ధర లోపు రియల్‌మి 10ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 8నే లాంచ్..!