Realme GT Neo 3T : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి కొత్త GT Neo సిరీస్.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

Realme GT Neo 3T : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) భారత మార్కెట్లో Realme GT Neo 3T మోడల్ లాంచ్ చేసింది. Realme GT Neo 3 కొత్త టోన్-డౌన్ ఫోన్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా పాత వెర్షన్ మాదిరిగానే కనిపిస్తుంది.

Realme GT Neo 3T : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి కొత్త GT Neo సిరీస్.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

Realme GT Neo 3T with 80W fast charging, Snapdragon 870 SoC launched in India

Realme GT Neo 3T : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) భారత మార్కెట్లో Realme GT Neo 3T మోడల్ లాంచ్ చేసింది. Realme GT Neo 3 కొత్త టోన్-డౌన్ ఫోన్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా పాత వెర్షన్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ స్పెసిఫికేషన్‌లలో చిన్నపాటి మార్పులతో వచ్చింది. ఈ ఫోన్ ఇప్పుడు Qualcomm చిప్‌సెట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. కస్టమర్‌లు మూడు కలర్ ఆప్షన్‌లు, మూడు స్టోరేజ్ మోడ్‌లను సొంతం చేసుకోవచ్చు.

ఇండియాలో Realme GT నియో 3T ధర ఎంతంటే? :
Realme GT Neo 3T మూడు కలర్ (డాష్ వైట్, డ్రిఫ్టింగ్ ఎల్లో, షేడ్ బ్లాక్) ఆప్షన్లలో వస్తుంది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో 6GB RAM + 128GB స్టోరేజ్ ధర (రూ. 29,999), 8GB RAM + 128GB స్టోరేజ్ రూ. 31,999, 8GB RAM స్టోరేజ్ ధర రూ.2933గా ఉంటుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 23న ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అధికారిక రియల్‌మే ఛానెల్‌ (Realme Official Website) ద్వారా షెడ్యూల్ చేయనుంది. దాదాపు 7,000 వరకు విలువైన సేల్ ఆఫర్‌లతో ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దాంతో రియల్‌మి GT Neo 3T ధర రూ.22,999కి తగ్గవచ్చని Realme తెలిపింది.

Realme GT Neo 3T with 80W fast charging, Snapdragon 870 SoC launched in India

Realme GT Neo 3T with 80W fast charging, Snapdragon 870 SoC launched in India

Realme GT నియో 3T స్పెసిఫికేషన్స్ ఇవే :
Realme GT Neo 3T డిజైన్ పరంగా చూస్తే.. బ్యాక్ కెమెరా మాడ్యూల్‌లో చూడటానికి GT Neo 3 లాగా కనిపిస్తుంది. అయితే 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.62-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1300 నిట్‌లతో కంపెనీ పేర్కొంది. హుడ్ కింద.. Qualcomm Snapdragon 870 5G చిప్‌సెట్ ద్వారా 8GB వరకు RAM, 256GB స్టోరేజీతో వచ్చింది. 100 శాతం కోర్ హీట్ సోర్స్‌తో స్మార్ట్‌ఫోన్ 8-లేయర్ హీట్ డిస్సిపేషన్ స్ట్రక్చర్‌తో వస్తుందని రియల్‌మే పేర్కొంది.

Realme GT Neo 3T with 80W fast charging, Snapdragon 870 SoC launched in India

Realme GT Neo 3T with 80W fast charging, Snapdragon 870 SoC launched in India

ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌లో 64-MP ప్రైమరీ కెమెరా, 8-MP, 2-MP ట్రిపుల్ సెన్సార్ ఉన్నాయి. 16-MP ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరా యాప్ సూపర్ నైట్‌స్కేప్ మోడ్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్ వంటి మోడ్‌లతో వచ్చింది. అక్టోబర్ 2022లో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను అందించనుంది. Realme GT Neo 3T ముఖ్య హైలైట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో రానుంది. 12 నిమిషాల్లో ఫోన్ 50 శాతం ఛార్జింగ్ చేయవచ్చునని Realme పేర్కొంది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ యాక్సెస్ కోసం 5G సపోర్టు, Wi-Fi డ్యూయల్-ఛానల్ నెట్‌వర్క్ సపోర్టు చేస్తుందని రియల్‌మి వెల్లడించింది.

Read Also : Best Smartphones in India : రూ.35వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!