Redmi Note 12 Pro+ : భారత్‌కు రానున్న షావోమీ రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్.. ధర ఎంత? స్పెషిఫికేషన్లు ఏమి ఉండొచ్చుంటే?

Xiaomi 12i HyperCharge : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Redmi Note 12 సిరీస్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు, MIUI కోడ్‌లో Redmi Note 12 Pro+ కూడా భారత మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు కంపెనీ భావిస్తోంది. మిడ్-రేంజ్ డివైజ్ ఇప్పటికే BIS సర్టిఫికేషన్‌ను పొందింది.

Redmi Note 12 Pro+ : భారత్‌కు రానున్న షావోమీ రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్.. ధర ఎంత? స్పెషిఫికేషన్లు ఏమి ఉండొచ్చుంటే?

Redmi Note 12 Pro said to arrive in India as Xiaomi 12i HyperCharge Expected price and specs

Xiaomi 12i HyperCharge : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Redmi Note 12 సిరీస్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు, MIUI కోడ్‌లో Redmi Note 12 Pro+ కూడా భారత మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు కంపెనీ భావిస్తోంది. మిడ్-రేంజ్ డివైజ్ ఇప్పటికే BIS సర్టిఫికేషన్‌ను పొందింది. IMEI డేటాబేస్‌లో కనిపించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ Redmi Note 12 Pro+ లాంచ్ సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. MIUI టెస్టర్, Kacper Skrzypek, Redmi Note 12 Pro+ భారత మార్కెట్లో Xiaomi 12i హైపర్‌ఛార్జ్‌గా వస్తుందని ట్విట్టర్‌లో వెల్లడించింది.

మునుపటి వెర్షన్‌తో కూడా కంపెనీ ఇలాంటిదే చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో లాంచ్ అయిన Xiaomi 11i హైపర్‌ఛార్జ్, Redmi Note 11 Pro+ రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. Xiaomi జనవరిలో హైపర్‌ఛార్జ్ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. కొన్ని ప్రీమియం ఫీచర్లను ప్యాక్ చేస్తూనే స్పీడ్ ఛార్జింగ్ స్పీడ్‌తో ఫోన్‌ను యూజర్లకు అందించనుంది.

రాబోయే Xiaomi 12i హైపర్‌ఛార్జ్ 120W ఫాస్ట్ ఛార్జ్‌తో రావచ్చు. ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉన్న Redmi Note 12 Pro+ మాదిరిగానే స్పెసిఫికేషన్‌లు ఉంటాయి. రాబోయే Xiaomi ఫోన్ హుడ్ కింద MediaTek 1080 SoC, HDR 10+ OLED డిస్‌ప్లేను ప్యాక్ చేయనుంది.

Redmi Note 12 Pro said to arrive in India as Xiaomi 12i HyperCharge Expected price and specs

Redmi Note 12 Pro said to arrive in India as Xiaomi 12i HyperCharge Expected

ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. దాదాపు 6.67-అంగుళాల సైజులో ఉంటుంది. హ్యాండ్‌సెట్ హుడ్ కింద సాధారణ 5,000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తుంది. వెనుకవైపు, Redmi Note 12 Pro+లో మూడు కెమెరాలు అందుబాటులో ఉంటాయి. సెటప్‌లో 8-MP, 2-MP కెమెరాలతో పాటు 200-MP ప్రైమరీ సెన్సార్ కూడా ఉండవచ్చు. సరికొత్త ఆండ్రాయిడ్ 13 OS అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. భారత్‌లో Xiaomi 12i హైపర్‌ఛార్జ్ ధర రూ. 30వేల లోపు ఉంటుంది.

భారత మార్కెట్లో రూ. 26,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుంది. చైనాలో, Redmi Note 12 Pro+ CNY 2,099కి సేల్ అందుబాటులో ఉండనుంది. భారత మార్కెట్లో దాదాపు రూ. 24వేల వరకు ఉండొచ్చుని అంచనా. కానీ, ఇదే ధర ఉండకపోవచ్చు. Xiaomi భారత మార్కెట్లో ధర రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Elon Musk: వైన్ యాప్ తిరిగిరాబోతుందా? ట్విటర్ టేకోవర్ తరువాత మస్క్ ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభించాడా?