Google-Meta Fined : ప్రపంచ టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు భారీ జరిమానాలు!

ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా (ఫేస్‌బుక్)కు భారీ షాక్ తగిలింది. స్థానిక చట్టం కింద నిషేధం విధించిన కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు రష్యా కోర్టు భారీ జరిమానాలు విధించింది.

Google-Meta Fined : ప్రపంచ టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు భారీ జరిమానాలు!

Russian Court Slaps Google, Meta With Massive Fines

Google-Meta Fined : ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా (ఫేస్‌బుక్)కు భారీ షాక్ తగిలింది. ఈ రెండు దిగ్గజాలకు రష్యా కోర్టు భారీ జరిమానాలు విధించింది. స్థానిక చట్టం కింద నిషేధం విధించిన కంటెంట్‌ను తొలగించడంలో గూగుల్, మెటా కంపెనీలు విఫలమైనందుకు మాస్కో కోర్టు వేర్వేరుగా జరిమానాలను విధించింది. నిషేధిత కంటెంట్ తొలగించాలంటూ టెక్ కంపెనీలపై ఎప్పటినుంచో రష్యా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో గూగుల్, మెటా విఫలం కావడంతో మాస్కో కోర్టు శుక్రవారం గూగుల్‌కు దాదాపు $100 మిలియన్ డాలర్లు జరిమానా విధించింది.

అలాగే Facebook పేరెంట్ కంపెనీ మెటా (Meta)కు $27 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. టాగన్‌స్కీ (Tagansky) డిస్ట్రిక్ట్ కోర్ట్ నిషేధించిన కంటెంట్‌ను తొలగించడంలో గూగుల్ పదేపదే నిర్లక్ష్యం చేసిందని కోర్టు తీర్పునిచ్చింది. సుమారు 7.2 బిలియన్ రూబిళ్లు (సుమారు 98.4 మిలియన్ డాలర్లు) అడ్మినిస్ట్రేటివ్ జరిమానా చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై నిర్ణయం తీసుకోవడానికి ముందు కోర్టు డాక్యుమెంట్లపై అధ్యయనం చేస్తామని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోర్టు నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు మెటాపై 1.9 బిలియన్ రూబుల్ ($27.2 మిలియన్) అడ్మినిస్ట్రేటివ్ జరిమానాను కూడా విధించింది.

మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన కంటెంట్‌ను తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించడంలో విఫలమయ్యారని రష్యా అధికారులు ఆరోపిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఒత్తిడిని పెంచారు. ఈ ఏడాది ప్రారంభంలో జైలులో ఉన్న క్రెమ్లిన్ విమర్శకుడు అలెక్సీ నవల్నీకి మద్దతుగా అనుమతి లేని నిరసనలపై ప్రకటనలను తొలగించలేదని టెక్ కంపెనీలపై రష్యా అధికారులు మండిపడ్డారు. గతంలోనూ గూగుల్, ఫేస్‌బుక్ ట్విటర్‌లపై రష్యా కోర్టులు పలుమార్లు జరిమానాలు విధించాయి. విదేశీ టెక్నాలజీ దిగ్గాజలు రష్యాలోని సర్వర్‌లలో రష్యన్ పౌరుల వ్యక్తిగత డేటాను స్టోర్ చేయాలని రష్యా అధికారులు డిమాండ్ చేశారు.

ఈ విషయంలోనూ గూగుల్, మెటా కంపెనీలు విఫలమైతే జరిమానాలు లేదా నిషేధం విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. రష్యా పార్లమెంటు దిగువ సభలో సమాచార విధానాలపై కమిటీ అధిపతి అలెగ్జాండర్ ఖిన్‌స్టెయిన్, భారీ జరిమానా అన్ని ఐటీ దిగ్గజాలకు స్పష్టమైన సందేశాన్ని పంపాలని డిమాండ్ చేశారు. రష్యాలో గూగుల్‌ కార్యకలాపాలను ఈ జరిమానా ప్రభావం ఉండదని, ఇతర టెక్ దిగ్గజాలకుసందేశమిచ్చినట్లు ఉంటుందని రష్యా అధికారి అలెగ్జాండర్‌ ఖిన్‌స్టీన్‌ తెలిపారు.

Read Also : Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ వ్యాలిడిటీ 28 రోజులే ఎందుకు? దీని వల్ల టెలికామ్ కంపెనీలకు ఎంత లాభం