ఎట్రాక్టింగ్ ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ A20 సిరీస్ ఇదే

మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సందడి మొదలైంది. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లన్నీ మెరిసిపోతున్నాయి. సమ్మర్ సీజన్ కావడంతో సరికొత్త మోడల్ ఫోన్ల కోసం యూజర్లు క్యూ కడుతున్నారు.

  • Published By: sreehari ,Published On : March 20, 2019 / 10:51 AM IST
ఎట్రాక్టింగ్ ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ A20 సిరీస్ ఇదే

మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సందడి మొదలైంది. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లన్నీ మెరిసిపోతున్నాయి. సమ్మర్ సీజన్ కావడంతో సరికొత్త మోడల్ ఫోన్ల కోసం యూజర్లు క్యూ కడుతున్నారు.

మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సందడి మొదలైంది. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లన్నీ మెరిసిపోతున్నాయి. సమ్మర్ సీజన్ కావడంతో సరికొత్త మోడల్ ఫోన్ల కోసం యూజర్లు క్యూ కడుతున్నారు. మొబైల్ కంపెనీలు పోటాపోటీగా తమ ప్రొడక్ట్ లను విడుదల చేస్తున్నాయి. యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు అద్భుతమైన ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి.

ప్రముఖ సౌత్ కొరియన్ మొబైల్ మేకర్ Samsung Galaxy సిరీస్ లను బ్యాక్ టూ బ్యాక్ టూ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లో గెలాక్సీ ఏ10, గెలాక్సీ 30, గెలాక్సీ 50 సిరీస్ ను Indian marketsలో రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎ20 సిరీస్ ను మాత్రం శాంసంగ్ రష్యాలో విడుదల చేసింది. త్వరలో భారత్ లో కూడా గెలాక్సీ ఎ20 సిరీస్ ను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 

ప్రస్తుతం Galaxy A20 సిరీస్ రష్యా మార్కెట్లలో అందుబాటులో ఉంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో మీడియం స్పెషిఫికేషన్లు, ఫీచర్లు కలిగిన సిరీస్ ను శాంసంగ్ అందిస్తోంది. శాంసంగ్ సిరీస్ లో వచ్చిన మిగతా మోడల్ డివైజ్ ల్లో ఉన్న Features ఎ20 సిరీస్ లో కూడా ఉన్నాయి. ఇంతకీ గెలాక్సీ ఎ20 ధర ఎంతో తెలుసా? రష్యా మార్కెట్లలో Rub 13వేల 990, అదే భారత మార్కెట్లలో ఈ ఫోన్ ధర రూ.15వేల వరకు ఉంటుంది. గత ఏడాది రిలీజ్ చేసిన మోడళ్లలో ఫ్రంట్ స్ర్కీన్ పై వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంది. ఈ ఏడాదిలో శాంసంగ్ అందించే గెలాక్సీ ఎ20 డివైజ్ లోని ఫీచర్లు యూజర్లను మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి.

శాంసంగ్ సిరీస్ స్పెషిఫికేషన్లు
* 6.4 అంగుళాల డిసిప్లే, సూపర్ AMOLED
*  స్ర్కీన్ రిజుల్యుషన్ 720*1560 ఫిక్సల్స్ హెచ్ డీ +డిసిప్లే
*  ఇన్ఫినిటీ వీ డిసిప్లే డిజైన్, అక్టో కోర్ ఎక్సోనస్ 7884 ఎస్ఓసీ
*  3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీ
*  మైక్రో SD కార్డు స్లాట్
*  512 GB ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజీ
*  ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ పై, వర్షన్ 9.0
*  రియల్ కెమెరా సెన్సార్, ఫ్రంట్ కెమెరా సెన్సార్ 
*  రియల్ డ్యుయల్ కెమెరా 13మెగా ఫిక్సల్, 5మెగా ఫిక్సల్
*  ఫ్రంట్ కెమెరా 8మెగా ఫిక్సల్ 
*  Rear ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
*  పెద్ద సైజు బ్యాటరీ 4000ఎంఎహెచ్