Twitter 2FA Setup : వచ్చే మార్చి నుంచి ట్విట్టర్‌ యూజర్లు ఛార్జీలు చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?

Twitter 2FA Setup : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) యూజర్లకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటినుంచి ట్విట్టర్ వినియోగంపై అనేక నిబంధనలు తీసుకొచ్చింది.

Twitter 2FA Setup : వచ్చే మార్చి నుంచి ట్విట్టర్‌ యూజర్లు ఛార్జీలు చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?

Twitter to Begin Charging Users to Protect Their Accounts via SMS Messages From March

Twitter 2FA Setup : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) యూజర్లకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటినుంచి ట్విట్టర్ వినియోగంపై అనేక నిబంధనలు తీసుకొచ్చింది. త్వరలో ట్విట్టర్ మరో కొత్త రూల్ ప్రవేశపెట్టనుంది. ప్రత్యేకించి ట్విట్టర్ బ్లూ టిక్ (Twitter Blue Tick) సభ్యుత్వాన్ని పొందని యూజర్లపై ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. అంటే.. ట్విట్టర్ బ్లూ సభ్యత్వం పొందని యూజర్ల కోసం SMS ఆధారిత టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) సపోర్టును త్వరలో నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.

మైక్రోబ్లాగింగ్ సర్వీసు ప్రకారం.. ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లలో టెక్స్ట్-ఆధారిత లాగిన్ అథెంటికేషన్ కోడ్‌లను నిలిపివేసేందుకు మార్చి 20 వరకు అవకాశం ఉంటుంది. అప్పటిలోగా ట్విట్టర్ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే.. SMS కోడ్‌లను పొందాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ 2FA సెటప్ పొందాలంటే.. చాలా మంది ట్విట్టర్ యూజర్లు Twitter Blue సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. ఒకవేళ వినియోగదారులు తమ అకౌంట్లో బ్లూ టిక్ సభ్యత్వం వద్దనకుంటే.. అదనపు ఖర్చు లేకుండా Twitter ప్రత్యామ్నాయ 2FA పద్ధతులకు సపోర్టు చేస్తుంది. వాస్తవానికి SMS ఆధారిత 2FAకి ఉచితంగా యాక్సస్ చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడు ఆ మెథడ్ నిలివేయాలని ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. దీని కారణం లేకపోలేదు..

Read Also : Twitter Blue: ఇండియాలోనూ బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రారంభించనున్న ట్విట్టర్.. నెలవారి రుసుము ఎంతంటే?

యూజర్ ఫోన్-నంబర్ మెకానిజంతో అకౌంట్ యూజర్ డేటా దుర్వినియోగానికి గురవుతుందని ట్విట్టర్ అభిప్రాయపడుతోంది. అందులో భాగంగానే ట్విట్టర్ Twitter బ్లూ సబ్‌స్క్రైబర్‌ల కోసం SMS-ఆధారిత 2FAకి యాక్సెస్ పరిమితం చేస్తుంది. అంటే.. ఎవరైతే యూజర్ బ్లూ టిక్ సభ్యుత్వాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ 2FA సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త విధానం ఒక్కో దేశంలో అక్కడి విధానాలకు అనుగుణంగా మారుతుంటుంది.

Twitter to Begin Charging Users to Protect Their Accounts via SMS Messages From March

Twitter 2FA Setup : Twitter to Begin Charging Users to Protect Their Accounts via SMS Messages From March

ట్విట్టర్ 2FA Setup చేసుకోవాలంటే ఎలా? :

వచ్చే మార్చి నుంచి ట్విట్టర్ యూజర్లకు తమ అకౌంట్లను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అదనపు ఛార్జీలను విధించనుంది. SMS ఆధారిత సర్వీసులను పొందాలంటే యూజర్లు తప్పనిసరిగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ట్విట్టర్ భారీ నెలవారీ రుసుము చెల్లించకూడదనుకుంటే Twitter బ్లూ ధర భారత్‌లో నెలకు రూ. 900గా ఉంది. మీ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి SMS ఆధారిత 2-Factor అథెంటికేషన్ కోసం (Authentication App) యాప్‌ల ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. మీరు Authy, Google Authenticator, Microsoft Authenticator, వంటి ఓపెన్ సోర్స్ Aegis Authenticator వంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి యాప్-ఆధారిత టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ సెటప్ ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* మీ కంప్యూటర్‌లో Twitter వెబ్‌సైట్‌లోని Settings సెక్షన్ విజిట్ చేయండి.
* Security and account access > Security > Two-factor authenticationపై క్లిక్ చేయండి .
* మీ అకౌంట్లో Text Message ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉంటే దాన్ని Disable చేయండి.
* ఇప్పుడు Authentication app > Get started > ఎంచుకోండి.
* మీరు డౌన్‌లోడ్ చేసిన అథెంటికేషన్ యాప్‌ని ఓపెన్ చేయాలి.
* Twitter వెబ్‌సైట్‌లో కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేయండి.
* సెటప్ ప్రాసెస్‌ను నిర్ధారించాలంటే.. మీ అథెంటికేషన్ యాప్‌లో కనిపించే 6 అంకెల డిజిట్ కోడ్‌ను ఎంటర్ చేయండి.

Read Also : Nokia X30 vs Nokia G60 : నోకియా X30, నోకియా G60 ప్రాసెసర్ సేమ్.. ధర, ఫీచర్లు ఇవే.. రెండు ఫోన్లలో ఏది బెటర్ అంటే?