Google Bard: ‘చాట్‌జీపీటీ’కి పోటీగా గూగుల్ ‘బార్డ్’.. బ్లాగ్ ద్వారా వెల్లడించిన సుందర్ పిచాయ్
Google Bard: మైక్రోసాఫ్ట్ రూపొందించిన ‘చాట్‌జీపీటీ’ సంచలనం సృష్టిస్తున్న వేళ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా మరో చాట్‌బోట్‌ను తీసుకొచ్చింది.

Google Bard: మైక్రోసాఫ్ట్ రూపొందించిన ‘చాట్‌జీపీటీ’ సంచలనం సృష్టిస్తున్న వేళ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా మరో చాట్‌బోట్‌ను తీసుకొచ్చింది. ‘బార్డ్’ పేరుతో గూగుల్ కూడా సరికొత్త చాట్‌బోట్‌ను రూపొందించింది. ఈ విషయాన్ని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి అదానీ ఎంత ధనాన్ని ఇచ్చారు?: పార్లమెంటులో రాహుల్
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సంస్థ రూపొందించిన ‘చాట్‌జీపీటీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా పని చేసే ‘చాట్‌జీపీటీ’ని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ‘ఓపెన్ఏఐ’ అనే సంస్థ రూపొందించింది. దీనిలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టింది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మరిన్ని బిలియన్ డాలర్లు కేటాయిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇటీవలే ప్రకటించింది. యూజర్లు అడిగిన సమాచారాన్ని ‘చాట్‌జీపీటీ’ కచ్చితత్వంతో అందిస్తోంది. వ్యాసాలు, కవితలు, ప్రోగ్రామింగ్ కోడ్ వంటి వాటిని కావాల్సినట్లుగా అందిస్తోంది. ఇప్పటికే యూజర్లను ఇది విపరీతంగా ఆకర్షిస్తోంది.
Rushikonda Green Mats : కోటింగా? మ్యాటింగా? హాట్ టాపిక్‌గా మారిన రుషికొండపై జియో మ్యాటింగ్
‘చాట్‌జీపీటీ’ని మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఎంఎస్ ఆఫీస్, బింజ్ సెర్చింజెన్తో జత చేసేందుకు కూడా ప్రయత్నిస్తోంది. గూగుల్ అందించే సమాచారాన్నే ‘చాట్‌జీపీటీ’ మరింత స్పష్టంగా, కచ్చితత్వంతో ‘చాట్‌జీపీటీ’ అందిస్తుంది. దీంతో గూగుల్ అప్రమత్తమైంది. ఈ సంస్థ కూడా పోటీగా ‘బార్డ్’ పేరుతో ఇలాంటి చాట్బోట్నే తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్ని సుందర్ పిచాయ్ వెల్లడించారు. ప్రస్తుతం ‘బార్డ్’ను ప్రయోగాత్మకంగా కొందరు యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చినట్లు, ఈ ఏడాదిలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
‘బార్డ్’ లామ్డా (లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ సిస్టమ్) ఆధారంగా పని చేస్తుంది. ఇది గూగుల్ సంస్థకు చెందిన లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ సిస్టమ్. కష్టమైన అంతరిక్ష ఆవిష్కరణల్ని కూడా చిన్న పిల్లలకు అర్థమయ్యేంత సులభంగా ‘బార్డ్’ అందించగలుగుతుంది. 2030కల్లా చాట్‌బోట్ సేవలకు దాదాపు 4 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంటుందని టెక్ సంస్థలు భావిస్తున్నాయి. అందుకే ఈ టెక్నాలజీపై అనేక సంస్థలు ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నాయి.