Rushikonda Green Mats : కోటింగా? మ్యాటింగా? హాట్‌ టాపిక్‌గా మారిన రుషికొండపై జియో మ్యాటింగ్‌

రుషికొండపై ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తవ్వకాలు జరిగిన చోట గ్రీన్ మ్యాట్స్ తో కవర్ చేస్తున్నారు. ఇంతకాలం పచ్చదనం కోల్పోయిన కొండపై గ్రీన్ మ్యాట్స్ పరవడంతో మళ్లీ పచ్చగా కనిపిస్తోంది. ఇప్పుడీ అంశంపై విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక కారణం ఉందంటోంది. పచ్చదనం కాపాడేందుకే జియో మ్యాటింగ్ చేస్తున్నామంటోంది.

Rushikonda Green Mats : కోటింగా? మ్యాటింగా? హాట్‌ టాపిక్‌గా మారిన రుషికొండపై జియో మ్యాటింగ్‌

Rushikonda Green Mats : రుషికొండపై ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తవ్వకాలు జరిగిన చోట గ్రీన్ మ్యాట్స్ తో కవర్ చేస్తున్నారు. ఇంతకాలం పచ్చదనం కోల్పోయిన కొండపై గ్రీన్ మ్యాట్స్ పరవడంతో మళ్లీ పచ్చగా కనిపిస్తోంది. ఇప్పుడీ అంశంపై విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక కారణం ఉందంటోంది. పచ్చదనం కాపాడేందుకే జియో మ్యాటింగ్ చేస్తున్నామంటోంది.

జియో మ్యాటింగ్ చేయడం ద్వారా కొండను తొలచిన భాగాల నుంచి మట్టి, రాళ్లు కింద పడకుండా ఉంటాయని.. మొక్కలు మళ్లీ పెరిగేందుకు దోహదపడుతుందని అధికారులు వివరించారు. కొండ పరిరక్షణ పనుల్లో భాగంగానే ఈ మ్యాటింగ్ చేస్తున్నామన్నారు ఏపీటీడీసీ అధికారులు. ఇప్పటివరకు కొండపై కొంత భాగమే జియో మ్యాటింగ్ చేశామని, రాబోయే రోజుల్లో మిగిలిన భాగాల్లోనూ చేస్తామంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టామన్నారు.

Also Read..Pawan Kalyan At Rushikonda : మట్టి గుట్ట ఎక్కి.. రుషికొండ దగ్గర నిర్మాణాలను పరిశీలించిన పవన్ కల్యాణ్

విశాఖ రుషికొండపై నిర్మాణాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తాజాగా రుషికొండ చుట్టూ మరోసారి వివాదం చెలరేగింది. కొండపై గ్రీన్ మ్యాట్ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతోంది. రుషికొండను తవ్వేసిన చోట మొత్తం తవ్వినట్లుగా కనిపించకుండా గ్రీన్ కార్పెట్‌ను కప్పేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Also Read..Botsa On Rushikonda : రుషికొండపై నిర్మాణాలతో మీకేంటి నష్టం? ప్రతిపక్షాలపై మంత్రి బొత్స ఫైర్

గతంలో తవ్విన చోట ఎర్రటి మట్టి స్పష్టంగా కనిపించేదని.. అయితే ఈ గ్రీన్ మ్యాట్‌ను వేయడం వల్ల దూరం నుంచి చూసిన వారికి కొండ అంతా పచ్చగా కనిపించేలా ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందనే ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రభుత్వంపై సెటైర్లు పేలుతున్నాయి.

మార్చిలో విశాఖ వేదికగా జీ20 గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు తరలివస్తారు. వారు రుషికొండను చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతోనే అధికారులు మసిపూసి మారేడుకాయ చేసినట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రభుత్వం వాదన మాత్రం మరోలా ఉంది. కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రుషికొండపై పచ్చదనం పెంచేందుకే జియోమ్యాటింగ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొండను తొలిచిన భాగాల నుంచి మట్టి, రాళ్లు కింద పడకుండా ఉండేందుకు అలాగే.. మొక్కలు మళ్లీ పెరిగేందుకు జియోమ్యాటింగ్ ఉపయోగపడుతుందని వివరణ ఇస్తున్నారు. అందుకే, తొలచిన భాగం అంతా ఇలా గ్రీన్ మ్యాటింగ్ చేస్తున్నట్లు చెప్పారు. జియోమ్యాటింగ్ వల్ల పచ్చదనం పెరిగి రుషికొండ గతంలో మాదిరిగా పచ్చగా మారుతుందని కూడా అంటున్నారు. అయితే పచ్చగా ఉన్న కొండను తవ్వడం ఎందుకు.. మళ్లీ మొక్కలు పెరగాలని జియోమ్యాటింగ్ వేయడం ఎందుకని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.