WhatsApp Edit Message : వాట్సాప్‌లో కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందో తెలుసా?

WhatsApp Edit Message : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతోంది. పొరపాటున ఏదైనా మెసేజ్ పంపిన తర్వాత ఆ మెసేజ్ ఎడిట్ చేసుకునేందుకు వాట్సాప్ యూజర్లను అనుమతించనుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

WhatsApp Edit Message : వాట్సాప్‌లో కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందో తెలుసా?

WhatsApp confirms release of Edit Message feature, here is how it will work

WhatsApp Edit Message : ఆండ్రాయిడ్, (iOS)లో కొన్ని సూపర్ పర్సనల్ చాట్‌లను లాక్ చేయగల సామర్థ్యాన్ని లాంచ్ చేసిన తర్వాత వాట్సాప్ యాప్‌కి మరో పెద్ద అప్‌డేట్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ధృవీకరించింది. వాట్సాప్ ఫీచర్ కచ్చితమైన పేరును ధృవీకరించలేదు. అయితే, యూజర్లు తమ మెసేజ్‌లను త్వరలో ఎడిట్ చేయగలదని చూపించే వీడియోను పోస్ట్ చేసింది. దీనికి అదనంగా, ఈ ఎడిట్ మెసేజ్ ఆప్షన్ ఎలా పని చేస్తుందో అధికారిక వీడియో వెల్లడించలేదు.

వాట్సాప్ బీటా వెర్షన్‌లలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉందని (WABetaInfo) వెల్లడించింది. ఏదైనా మెసేజ్ ఎడిట్ చేయడానికి 15 నిమిషాల సమయం మాత్రమే అనుమతి ఉంది. వాట్సాప్ అందించిన టైమ్ లిమిట్ గడువు ముగిసిన తర్వాత, ఎలాంటి మార్పులు చేయలేరని గమనించాలి.

Read Also : Whatsapp Block Accounts : ఆ అకౌంట్లను వెంటనే బ్యాన్ చేయాలి.. వాట్సాప్‌కు కేంద్రం ఆదేశాలు..

పొరపాటున తప్పుడు మెసేజ్ పంపితే వెంటనే ఈ ఫీచర్ ద్వారా ఆ మెసేజ్ డిలీట్ చేసుకోవచ్చు. మొబైల్ కీబోర్డ్ కారణంగా కొన్నిసార్లు మెసేజ్ ఆటోమాటిక్‌గా సెండ్ కావడం వంటి అనేక సందర్భాలు ఉన్నాయి. వాట్సాప్ ఇప్పటికే మెసేజ్‌ని డిలీట్ చేసే ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఆ మెసేజ్‌ని మళ్లీ టైప్ చేయాలి. కొత్త అప్‌డేట్ మెసేజ్ ఎడిట్ చేసే సమయాన్ని సేవ్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.

WhatsApp confirms release of Edit Message feature, here is how it will work

WhatsApp confirms release of Edit Message feature, here is how it will work

వాట్సాప్‌లో మెసేజ్ ఎలా ఎడిట్ చేయాలంటే? :
యాప్ బీటా వెర్షన్ ప్రకారం.. మీరు ఎవరికైనా మెసేజ్ పంపిన తర్వాత వాట్సాప్ మీకు 15 నిమిషాల విండోను Undo లేదా ఎడిట్ చేస్తుంది. ఎడిట్ చేయాలనుకునే నిర్దిష్ట మెసేజ్ ఎక్కువసేపు ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మెసేజ్ ఎక్కువసేపు Tap చేసిన తర్వాత, వాట్సాప్ ‘Edit Message’ ఆప్షన్ డిస్‌ప్లే చేస్తుంది. మీ టెక్స్ట్ మెసేజ్ మార్చడానికి Tap చేయండి. మీ మెసేజ్ అప్‌డేట్ చేయడానికి కొత్త విండోను ఓపెన్ చేస్తుంది.

వాట్సాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ ఎప్పుడు వస్తుందంటే?
వాట్సాప్ త్వరలో ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను రిలీజ్ చేయనుంది. ఈ అప్‌డేట్ రాకను కంపెనీ ఇప్పుడే రివీల్ చేసింది. ఈ ఫీచర్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో లేదో వెల్లడించలేదు. దీనికి సంబంధించిన టీజర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్, iOS బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో లేదా వారాల్లో కంపెనీ ఎడిట్ బటన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.

Read Also : Royal Enfield EV : బైకులకు రారాజు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ వచ్చేస్తోంది.. గెట్ రెడీ..!