WhatsApp Users : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. డబ్బులు కొట్టేసేందుకు మోసగాళ్లు వాడుతున్న ట్రిక్ ఇదే..!

WhatsApp Users : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. యూపీఐ ఆధారిత యాప్ పేమెంట్లు ఇప్పుడు చాలా ఈజీ.. వాట్సాప్ ద్వారా యూజర్లు పేమెంట్స్ పంపుకోవచ్చు.

WhatsApp Users : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. డబ్బులు కొట్టేసేందుకు మోసగాళ్లు వాడుతున్న ట్రిక్ ఇదే..!

Whatsapp How Scammers Are Using Whatsapp To Trick Users, Steal Their Money

WhatsApp Users : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. యూపీఐ ఆధారిత యాప్ పేమెంట్లు ఇప్పుడు చాలా ఈజీ.. వాట్సాప్ ద్వారా యూజర్లు పేమెంట్స్ పంపుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు పేమెంట్స్ చేసుకోవచ్చు. QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి, WhatsAppలో ట్రాన్సాక్షన్లు చేయడానికి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో సులభంగా చెల్లింపులు చేసే సౌలభ్యం ఉండటంతో ఆన్ లైన్ మోసాలు కూడా భారగా పెరిగిపోయాయి. గతంలోనూ ఆన్‌లైన్‌కు సంబంధించి చాలా కేసులు నమోదయ్యాయి. కరోనా సమయంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ పెరిగాయి. చాలామంది డిజిటల్‌గా మారడంతో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయి. స్కామర్లు సులభంగా యూజర్లను మోసం చేసేందుకు QR కోడ్‌లను ఉపయోగిస్తున్నారు.

మీరు షాపులో లేదా స్నేహితులకు లేదా ఏదైనా సర్వీసుకు పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే QR కోడ్ అవసరం పడుతుంది. డబ్బు పంపే సమయంలోనే QR కోడ్‌ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ, డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి మాత్రం QR కోడ్ అవసరం లేదు. ఈ విషయం కొంతమంది యూజర్లకు ఇప్పటికీ తెలియకపోవచ్చు. అదే మోసగాళ్లకు మోసం చేయడం ఈజీ అయిపోతుంది. మీరు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ ద్వారా ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే మీ వివరాలను తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. స్కామర్‌లు మీ వస్తువుపై ఆసక్తి ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తారు. మీతో వాట్సాప్‌లో QR కోడ్‌ని షేర్ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్లో డబ్బును స్వీకరించడానికి Google Pay లేదా ఏదైనా ఇతర UPI ఆధారిత సర్వీసు ఉపయోగించి కోడ్‌ని స్కాన్ చేయమంటారు. మీరు డబ్బును స్వీకరించడానికి బదులుగా స్కామర్‌కు పేమెంట్ చేస్తున్నామనే విషయం తెలియకపోవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్ ఎలా జరుగుతుందో తెలియనివారంతా ఇలా మోసగాళ్ల చేతుల్లో మోసపోతుంటారు.

Whatsapp How Scammers Are Using Whatsapp To Trick Users, Steal Their Money (1)

Whatsapp How Scammers Are Using Whatsapp To Trick Users, Steal Their Money 

మీకు ఆన్‌లైన్ చెల్లింపుల కోసం WhatsAppలో QR కోడ్‌ని స్కాన్ చేయవచ్చు. ఆ తర్వాత పేరు లేదా UPI IDని రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఆపై పేమెంట్ చేయాలి. సైబర్ మోసగాళ్లు.. WhatsApp ద్వారా QR కోడ్‌ను పంపవచ్చు. UPI యాప్‌ స్కాన్ చేయమని MPINని నమోదు చేయమని అడగవచ్చు. ప్రాథమికంగా మీ బ్యాంకింగ్ యాప్ కోసం సెట్ చేసిన మొబైల్ PIN ఉంటుంది. అదే QR కోడ్‌ని ఉపయోగించి ఏదైనా కాంటాక్టును సేవ్ చేయడానికి WhatsApp అనుమతిస్తుంది, అందుకే యూజర్లు WhatsApp QR కోడ్‌ను మీకు నమ్మకం ఉన్నవారితోనే షేర్ చేసుకోవాలి. ఎవరైనా మీ WhatsApp QR కోడ్‌ని ఇతర వ్యక్తులకు ఫార్వార్డ్ చేసే అవకాశం ఉంది. మీ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్‌గా యాడ్ చేసుకోనే అవకాశం ఉంది. తద్వారా వారు మీకు ఏదైనా స్కాన్ కోడ్ చేయమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు.

Read Also : WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. గ్రూపు కాల్స్‌లో 32మంది మాట్లాడుకోవచ్చు..!