WhatsApp Channels : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇక మీ ప్రైవసీకి వజ్ర కవచం.. ఈ ‘ఛానల్స్’ టూల్ ఎలా పనిచేస్తుందో తెలుసా?
WhatsApp Channels : వాట్సాప్ ఛానెల్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకీ ఈ సరికొత్త ఫీచర్ వినియోగదారులకు ఎలా పనిచేస్తుందో తెలుసా?

WhatsApp introduces Channels, What is it, how it works
WhatsApp Channels : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ వినియోగదారుల కోసం సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. వాట్సాప్ ఛానల్స్ (Whatsapp Channels) అనే ఈ సరికొత్త ఫీచర్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా తమ వ్యాపారాలను తరచుగా మార్కెట్ చేసే వ్యాపార యజమానులు, కంటెంట్ క్రియేటర్లకు, ‘Updates’ అనే కొత్త ట్యాబ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాబ్‌లో, యూజర్లు ఫాలో అయ్యేందుకు ఎంచుకున్న ఛానల్ నుంచి అప్‌డేట్‌లను పొందవచ్చు. ఈ అప్‌డేట్ ట్యాబ్ ద్వారా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కమ్యూనిటీలతో చేసే చాట్‌లకు భిన్నమైన కంటెంట్‌ను అందిస్తుంది. ఇంతకీ, వాట్సాప్ సరికొత్త ఫీచర్ ఎలా ఉపయోగించాలి అనేదానిపై కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్ ఛానల్స్ ఫీచర్ ఇదే :
వాట్సాప్ ఛానల్స్ ‘అడ్మిన్‌ల కోసం వన్-వే బ్రాడ్‌కాస్ట్ టూల్ అని మెసేజింగ్ యాప్ వివరించింది. దీని ద్వారా యూజర్లు తమ కంటెంట్‌ను ఏ రూపంలోనైనా పంపవచ్చు. అది టెక్స్ట్ లేదా ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు, పోల్‌లు కూడా ఉన్నాయి. ఇంకా, వాట్సాప్ ప్రత్యేక డైరెక్టరీని కూడా నిర్మిస్తోంది. ఇందులో వాట్సాప్ యూజర్లు తమ ప్రాధాన్యతల ప్రకారం ఛానల్స్ కోసం సెర్చ్ చేయొచ్చు. తమ హాబీలు, ఇష్టమైన క్రీడా బృందాలు, స్థానిక అధికారుల నుంచి అప్‌డేట్‌లు, మరిన్నింటిని అందించే ఛానల్ అని చెప్పవచ్చు. కానీ, వాట్సాప్ ఛానల్ కోసం సైన్ అప్ చేయడానికి డైరెక్టరీ ద్వారా సెర్చ్ చేయడం మాత్రమే కాదు.. చాట్‌లు, ఇ-మెయిల్ లేదా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఇన్విటేషన్ లింక్‌ల నుంచి కూడా వినియోగదారులు ఛానల్ పొందవచ్చు.
ప్రైవసీ సమస్యలను పరిష్కరించవచ్చు :
ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అదే ఛానల్‌కు సభ్యత్వం పొందిన గుర్తు తెలియని యూజర్ల నుంచి ఫోన్ నంబర్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉంది. ప్రైవసీ సమస్యలను పరిష్కరిస్తూ.. వాట్సాప్ అత్యంత ‘private broadcast service”ను రూపొందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. నిర్వాహకులు, ఫాలోవర్ల మధ్య వ్యక్తిగత సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు వీలుంటుంది. వాట్సాప్ ఛానల్ అడ్మిన్‌గా మీ ఫోన్ నంబర్, ప్రొఫైల్ ఫొటో ఫాలోవర్లకు కనిపించదు. అలాగే, ఛానల్‌ని ఫాలో అయ్యే వారికి మీ ఫోన్ నంబర్ కనిపించదు. అడ్మిన్ లేదా ఇతర ఫాలోవర్లు.. ఎవరిని ఫాలో అవ్వాలని అనుకుంటారు అనేది పూర్తి యూజర్ల ఇష్టమే..

WhatsApp introduces Channels, What is it, how it works
వాట్సాప్ సర్వర్‌లలో ఛానల్ హిస్టరీని 30 రోజుల వరకు మాత్రమే స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత ఫాలోవర్ల డివైజ్‌ల నుంచి కూడా ఛానల్ హిస్టరీ అప్‌డేట్ అదృశ్యమైపోతుంది. అడ్మిన్‌లు తమ ఛానల్ నుంచి స్క్రీన్‌షాట్‌లను, ఫార్వార్డ్‌లను బ్లాక్ చేసే ఆప్షన్ కూడా కలిగి ఉంటారు. అలాగే, తమ ఛానెల్‌ని ఎవరు ఫాలో అవ్వాలో ఎవరు ఫాలో కాకూడదో నిర్ణయించగలరని కంపెనీ తెలిపింది. తమ ఛానెల్‌ని డైరెక్టరీలో కనిపించాలా లేదా అనేది కూడా కంట్రోలింగ్ కలిగి ఉంటారు. ప్రస్తుతానికి, వాట్సాప్ ‘చానల్స్ ఫీచర్ ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులను చేరుకోవడమే.. డిఫాల్ట్‌గా ఛానెల్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేదు. భవిష్యత్తులో ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
వాట్సాప్ ఛానల్ ఫీచర్ మొదట కొలంబియా, సింగపూర్‌లో అందుబాటులో ఉంటుంది. రాబోయే నెలల్లో ఈ ఫీచర్ మరిన్ని దేశాల్లో అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే పైన పేర్కొన్నట్లుగా, ప్రసార సందేశాలను పంపడానికి నిర్వాహకులు ఈ ఫీచర్‌ని వాడొచ్చు. వాట్సాప్ యూజర్లు తమ ప్రేక్షకులపై కూడా కంట్రోల్ కలిగి ఉంటారు. యూజర్ల విషయానికొస్తే.. డైరెక్టరీ ద్వారా తమకు ఇష్టమైన ఛానల్ కోసం సెర్చ్ చేయొచ్చు. సాధారణ అప్‌డేట్స్ పొందడానికి ఈ ఫీచర్ ఫాలో కావొచ్చు. చాట్‌లు, ఇ-మెయిల్ లేదా ఆన్‌లైన్‌లో పంపే ఇన్విటేషన్ లింక్ ద్వారా కూడా వినియోగదారులు తమ ఛానల్‌కు ఇన్విటేషన్ పొందవచ్చు.