Xiaomi 11i Hypercharge : ఫాస్ట్ హైపర్‌‌చార్జ్ స్మార్ట్‌ఫోన్‌.. 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్.. జనవరి 6న వచ్చేస్తోంది!

షావోమీ సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. Xiaomi 11i Hypercharge పేరుతో భారత మార్కెట్లో వస్తోంది.. వచ్చే ఏడాది 2022లో భారత మార్కెట్లో జనవరి 6న లాంచ్ కానుంది.

Xiaomi 11i Hypercharge : ఫాస్ట్ హైపర్‌‌చార్జ్ స్మార్ట్‌ఫోన్‌.. 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్.. జనవరి 6న వచ్చేస్తోంది!

Xiaomi 11i Hypercharge Is Launching Next Month, How Much Should It Cost

Xiaomi 11i Hypercharge : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. Xiaomi 11i Hypercharge పేరుతో లాంచ్ చేయనుంది. 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో రానున్న షావోమీ 11i హైపర్ చార్జ్ ఫోన్.. కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఈ ఫోన్‌లో ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. వచ్చే ఏడాది 2022లో భారత మార్కెట్లో జనవరి 6న లాంచ్ కానుంది. 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ తో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 11 Pro+ రీబ్రాండెడ్ వేరియంట్ అని చెప్పొచ్చు.

గత నెల చివరిలో చైనాలో ప్రారంభమైన ఈ కొత్త ఫోన్ భారత్ మార్కెట్లోకి 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో రానుంది. ఈ ఫోన్‌ భారత్‌లో రూ. 24,900గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 920 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. కెమెరాల విషయానికొస్తే.. 108-MP ట్రిపుల్ రియర్ కెమెరా డ్యూయల్ JBL‌-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి.

2021 ఏడాది ప్రారంభంలో Xiaomi Mi 11 Ultra స్మార్ట్ ఫోన్.. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చింది. రిటైల్ బాక్స్‌లో 55W ఫాస్ట్ ఛార్జర్ సపోర్టు మాత్రమే ఉంది. Xiaomi, Poco, Redmi స్మార్ట్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జింగ్‌ను 33W లిమిట్ అందించాయి. అయితే ఇప్పుడు.. Xiaomi 120W చార్జర్‌ సపోర్టుతో ఎలా తీసుకొస్తోందనేది ఆసక్తికరంగా మారింది. Xiaomi కంపెనీకి పోటీగా OnePlus, Realme డివైజ్‌ల్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించనుంది. హై టెక్నాలజీ కలిగిన Xiaomi 11i హైపర్‌ఛార్జ్ మిడ్-ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. భారత మార్కెట్లో Redmi Note 10 Pro Max ధర కంటే ఎక్కువనే ఉంటుందని అంచనా.

Redmi Note 10 Pro Max టాప్-ఎండ్ వేరియంట్ ధర ప్రస్తుతం భారత్ మార్కెట్లో రూ. 21,999గా ఉంది. Xiaomi 11i హైపర్‌ఛార్జ్ ధర అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చైనాలో Redmi Note 11 Pro+ ధర (6GB RAM 128GB స్టోరేజ్) వేరియంట్ ప్రారంభ ధర CNY 1,899 (సుమారు రూ. 22,200) నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Airtel vs Jio vs Vi : ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే!