Zomato And Swiggy Orders : 2023 కొత్త ఏడాది రోజున 5 లక్షలకు పైగా ఆర్డర్లు.. జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ లిస్టులో బిర్యానీ, పిజ్జా టాప్..!
Zomato And Swiggy Orders : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు కొత్త సంవత్సరం (2023 New Year Eve) సందర్భంగా బ్యాక్-టు-బ్యాక్ ఆర్డర్‌లతో చాలా బిజీగా మారాయి.

Zomato And Swiggy Orders _ Zomato and Swiggy received more than 5 lakh orders on New Year’s eve, biryani and pizza top the list
Zomato And Swiggy Orders : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు కొత్త సంవత్సరం (2023 New Year Eve) సందర్భంగా బ్యాక్-టు-బ్యాక్ ఆర్డర్‌లతో చాలా బిజీగా మారాయి. ప్రముఖ దేశీయ ఫుడ్ డెలివరీ యాప్‌లలో జొమాటో (zomato), స్విగ్గీ (Swiggy) కొత్త సంవత్సర వేడుకల సమయంలో తమకిష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేశారు. అందులో పలు నగరాల నుంచి 5 లక్షలకు పైగా ఆర్డర్‌లను డెలివరీ చేశారని కంపెనీలు వెల్లడించాయి.
నూతన సంవత్సర వేడుకల్లో స్విగ్గీ, జొమాటోల నుంచి భారతీయ యూజర్లు ఏమి ఆర్డర్ చేస్తున్నారో ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీలు వెల్లడించాయి. 2022 చివరి రోజున ఫుడ్ యాప్ డెలివరీ బృందం దేశవ్యాప్తంగా 3.5 లక్షల బిర్యానీలు, 2.5 లక్షల పిజ్జాలను డెలివరీ చేసిందని స్విగ్గీ వెల్లడించింది. 1.56 లక్షల బిర్యానీలు కూడా డెలివరీ చేసినట్టు స్విగ్గీ ట్వీట్ చేసింది. బిర్యానీ ఆర్డర్‌ల సంఖ్య ఇప్పుడు 1.65 లక్షలకు చేరుకుందని మరో ట్వీట్ పేర్కొంది.
మరోవైపు Zomato 16,514 బిర్యానీల కోసం ఆర్డర్‌లను అందుకుంది. డిసెంబర్ 31న దాదాపు 15 టన్నులు. 16,514 బిర్యానీలు (దాదాపు 15 టన్నులు) డెలివరీ చేసినట్టు వెల్లడించాయి. దేశంలోని జొమాటో వినియోగదారులు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ట్వీట్ చేశారు. ఫుడ్ డెలివరీ చేసిన ఆహార పదార్థాల్లో బిర్యానీ అగ్రస్థానంలో నిలవగా, రెస్టారెంట్‌ల నుంచి పిజ్జా కూడా బల్క్ ఆర్డర్‌లతో ‘@dominos_india , 61,287 పిజ్జాలు డెలివరీ’ చేయడం ద్వారా టాప్ లిస్టులో నిలచింది.

Zomato And Swiggy Orders _ Zomato and Swiggy received more than 5 lakh orders
రెస్టారెంట్ల నుంచి ఆహారం మాత్రమే కాదు.. ఫుడ్ డెలివరీ కంపెనీల నుంచి చిప్‌లతో సహా న్యూ ఇయర్ వేడుకల సామాగ్రిని కూడా పెద్దమొత్తంలో ఆర్డర్ చేశారు. అందులో 13,984 ప్యాకెట్ల నాచోలు, 14,453 నిమ్మకాయలు, 14,890 సోడాలు ఇప్పటి వరకు డెలివరీ చేసినట్టు స్విగ్గీ షేర్ చేసింది. 56,437 చిప్‌లు మరో 9 నిమిషాల్లో డెలివరీ చేయాల్సి ఉందని జొమాటో బ్లింకిట్ CEO అల్బిందర్ ధిండా ట్విట్టర్‌లో ఆర్డర్ గణాంకాలను వెల్లడించారు. బెంగుళూరుకు చెందిన బ్లింకిట్ వినియోగదారు ప్లాట్‌ఫారమ్ నుంచి దాదాపు రూ. 29,000కి అతిపెద్ద కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేసినట్లు ధిన్సా వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే కొత్త సంవత్సరం సందర్భంగా కంపెనీ ఆర్డర్‌లలో 47 శాతం పెరిగినట్లు Zomato షేర్ చేసింది. జొమాటో సీఈవో దీపేందర్ గోయల్ డెలివరీ బైక్‌పై ఎక్కి ఒక రోజు డెలివరీ ఏజెంట్‌గా మారారు. ప్రస్తుతం తన సొంతంగా రెండు ఆర్డర్‌లను డెలివరీ చేసినట్టు తెలిపారు. ఆసక్తికరంగా, తన మొదటి ఫుడ్ ఆర్డర్‌ని Zomato HQకి డెలివరీ చేశాడు.
ఇంతకుముందు, రెండు ప్లాట్‌ఫారమ్‌లు తమ వార్షిక నివేదికను వెల్లడించాయి. 2022లో భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన వాటిని షేర్ చేశాయి. ఆసక్తికరంగా, ఫుడ్ డెలివరీ యాప్‌లో బిర్యానీ అగ్ర ఎంపికగా నిలిచింది. 2022లో తన యాప్‌కి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్లు అందాయని జొమాటో వెల్లడించింది. మరోవైపు, 2022లో స్విగ్గీ యాప్‌కి ప్రతి నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Court Orders Zomato: ఆర్డర్ డెలివరీ చేయలేదని జొమాటోపై కేసు వేసిన లా స్టూడెంట్.. కోర్టు తీర్పు ఏంటో తెలుసా?