KTR On Age Relaxation : ఆ ఉద్యోగాలకు వయో పరిమితి ఐదేళ్లకు పెంపు..! కేటీఆర్ ఏమన్నారంటే..
కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని మొత్తంగా 5 సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా AskKTR లో ఓ నిరుద్యోగి ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.

KTR On Age Relaxation : కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని మొత్తంగా 5 సంవత్సరాలు పెంచాలని తెలంగాణలోని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా AskKTR లో ఓ నిరుద్యోగి ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. కరోనాతో రెండేళ్లు వృథా అయ్యాయని, తాజా నోటిఫికేషన్ లో ఇచ్చిన మూడు సంవత్సరాల సడలింపును మరో రెండేళ్లు అదనంగా పెంచాలని కోరాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. వయో పరిమితి పెంపు అంశాన్ని పరిశీలించాలని హోంమంత్రి మహమూద్ అలీని కోరతామని ఆ నిరుద్యోగికి భరోసా ఇచ్చారు కేటీఆర్.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో #AskKTR నిర్వహించారు. పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమం దాదాపు 90 నిమిషాల పాటు సాగింది. ఇందులో భాగంగానే ఓ నెటిజన్ పోలీస్ ఉద్యోగాల్లో వయో పరిమితి పెంపు విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.(KTR On Age Relaxation)
Telangana Jobs: తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవలే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దాదాపు 17 వేలకు పైగా ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2న ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 20. అయితే.. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి విషయంలో నిరుద్యోగుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది. ఇప్పటికే వయోపరిమితిని మూడేళ్ల పాటు పెంచింది తెలంగాణ సర్కార్. కనీసం ఐదేళ్లయినా పెంచాలని అనేక మంది నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
వయో పరిమితి పెంపు అంశాన్ని పరిశీలించాలని హోంమంత్రి మహమూద్ అలీని కోరతామని మంత్రి కేటీఆర్ ఇచ్చిన భరోసాతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. మరి హోంమంత్రి మహమూద్ అలీ ఎలా స్పందిస్తారు? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? చూడాలి.
కాగా, పోలీస్ శాఖలోని అనేక విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 17,099 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 587 ఎస్ఐ, 414 సివిల్ ఎస్ఐలతో పాటు 16,027 కానిస్టేబుల్, 66 ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి.
Telangana Govt jobs : తెలంగాణలో కొలువుల జాతర..కోచింగ్ సెంటర్ల బాటపట్టిన నిరుద్యోగులు
కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అత్యధికంగా టీఎస్ఎస్పీలో 5,010.. సివిల్‌లో 4,965.. ఏఆర్‌లో 4,423 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 23 TSSP సబ్ ఇన్ స్పెక్టర్, 12 SPF ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. విపత్తు, అగ్నిమాపక శాఖలోనూ 26 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 8 డిప్యూటీ జైలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నిమాపక, జైళ్ల శాఖ, ఐటీ విభాగంలోనూ పలు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Will request @mahmoodalitrs Garu to look into it https://t.co/mqRMVcsEvX
— KTR (@KTRTRS) May 8, 2022
- RevanthReddy Letter To KCR : ఐదేళ్లకు పెంచండి, లేదంటే 4లక్షల మంది నష్టపోతారు-సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి లేఖ
- Ministar ktr: నేటి నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన.. ఎన్నిరోజులంటే..
- KTR Fires On AmitShah : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా, వారివన్నీ తుక్కు మాటలే-కేటీఆర్ ఫైర్
- బీజేపీపై టీఆర్ఎస్ ప్రశ్నాస్త్రాలు
- MInister KTR: రాబోయే రోజుల్లో దేశంలో ఢిల్లీ తరువాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్
1Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
2CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
3RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
4IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
5Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
6IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
7Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
9Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
10Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య