9Years Of Modi Government: ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం.. బండి సంజయ్

గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవి. అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. అందుకే అవినీతికి తావులేకుండా డీబీటీ విధానంతో లబ్దిదారుడికి పథకాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజల్లోకి వెళుతున్నాం

9Years Of Modi Government: ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం.. బండి సంజయ్

Bandi Sanjay: మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఇచ్చిన ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేస్తున్నారని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాన్ని అమలు చేయలేకపోయిందని, కానీ మోదీ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో లోటుపాట్లను తెలుసుకుని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ 9 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Delhi Highcourt: రూ.2,000 నోట్ల మార్పిడికి ఐడి ప్రూఫ్ తప్పనిసరిపై కీలక తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు

ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవి. అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. అందుకే అవినీతికి తావులేకుండా డీబీటీ విధానంతో లబ్దిదారుడికి పథకాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజల్లోకి వెళుతున్నాం’’ అని అన్నారు.

Census: ఎన్నికలు ముగిసే వరకు జనగణన లేనట్టే.. ప్రజలకు కొత్తగా 31 ప్రశ్నలు

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత అభివ్రుద్దే మోదీ లక్ష్యం. అందుకే గత ప్రభుత్వంలోని మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత మోదీదే. గతంలో ఇందిరాగాంధీ హయాంలో ‘‘గరీబీ హఠావో’’ నినాదం మంచిదే. ఆ నినాదాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ పథకాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు అమలు చేయలేకపోయారో తెలుసుకుని.. మంచి ఉద్దేశంతో టాయిలెట్ల నిర్మాణం, రేషన్ బియ్యం సహా పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం’’ అని అన్నారు.