Bandla Ganesh: నా ప్రాణం పోయినా అలా చేయను.. చంద్రబాబు, విజయసాయి ఫొటోపై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్..

సినీ నిర్మాత బండ్ల గణేస్ ట్విటర్ ద్వారా హాట్ కామెంట్స్ చేశారు. నందమూరి తారకరత్న మరణంతో నివాళులర్పించేందుకు వచ్చిన చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఒకే దగ్గర కూర్చొని ముచ్చటిస్తున్న ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేశారు.

Bandla Ganesh: నా ప్రాణం పోయినా అలా చేయను.. చంద్రబాబు, విజయసాయి ఫొటోపై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్..

BANDLA GANESH

Bandla Ganesh: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్‌చేసి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను అంటూ తన ట్వీట్‌లో రాశాడు. బండ్ల గణేష్ ట్వీట్‌కు పలువురు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు ఇది రాజకీయ వేదిక కాదు కదా.. రాజకీయాల్లో సైద్దాంతికంగా విబేధాలు ఉండొచ్చు.. వ్యక్తిగతంగా కాదు అంటూ మరికొందరు రీ‌ట్వీట్ల ద్వారా తమ స్పందన తెలియజేస్తున్నారు.

Bandla Ganesh : బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌కి కౌంటర్ ఇచ్చాడా?

నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబంతో పాటు సినీ పరిశ్రమలోనూ, టీడీపీ శ్రేణుల్లోనూ విషాదం నింపింది. అన్నిరంగాల ప్రముఖులు తారకరత్న పార్ధీవదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. నందమూరి తారకరత్న సతీమణి అలైఖ్యారెడ్డి. ఆమెకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి బంధుత్వం ఉంది. తారకరత్న మరణంతో విజయసాయిరెడ్డి తారకరత్న నివాసంకు చేరుకొని అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తారకరత్నకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చంద్రబాబు తన కుటుంబంతో అక్కడకు చేరుకున్నాడు. ఈ క్రమంలో తారకరత్న కుటుంబానికి సంబంధించిన విషయాలపై చంద్రబాబు, విజయసాయిరెడ్డి కొద్దిసేపు చర్చించారు. వీరిద్దరూ ఒకేచోటు కూర్చొని మాట్లాడుకొనే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Bandla Ganesh : రాజకీయాల నుండి తప్పుకున్న బండ్ల గణేష్

చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఒకేచోట కూర్చొని మాట్లాడుకుంటున్న ఫొటోను బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ‘ నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, ఆ అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతా అది నా నైజం. అంత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి.. !! అంటూ తనదైన శైలిలో ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ పై కొందరు నెటిజన్లు బండ్ల గణేష్ అభిప్రాయానికి మద్దతు పలుకుతుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.