BJP, Congress Protest : వీవీ ప్యాట్స్‌ను ప్రైవేటు వాహనంలో తరలింపుపై బీజేపీ, కాంగ్రెస్‌ ఆందోళన

కరీంనగర్‌ జిల్లాలో వీవీ ప్యాట్స్‌ తరలింపుపై బీజేపీ, కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టాయి. వీవీ ప్యాట్స్‌ను ప్రైవేటు వాహనంలో ఎందుకు తరలించారని అధికారులతో వాగ్వాదానికి దిగారు.

BJP, Congress Protest : వీవీ ప్యాట్స్‌ను ప్రైవేటు వాహనంలో తరలింపుపై బీజేపీ, కాంగ్రెస్‌ ఆందోళన

Vv Pats

move of VV Pats in private vehicle : కరీంనగర్‌ జిల్లాలో వీవీ ప్యాట్స్‌ తరలింపుపై బీజేపీ, కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టాయి. వీవీ ప్యాట్స్‌ను ప్రైవేటు వాహనంలో ఎందుకు తరలించారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్‌ చెప్పినా నాయకులు సంతృప్తి చెందలేదు. వీవీ ప్యాట్ లను ప్రైవేట్ వాహనాల్లో తరలించలేదని అధికారి రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

వదంతులు నమ్మవద్దని ఎన్నికల కోరారు. పనిచేయని వీవీ ప్యాట్‌ను మాత్రమే తరలించామని అధికారులు తెలిపారు. 200వ పోలింగ్ స్టేషన్ లో మాక్ పోలింగ్ సందర్భంగా వీవీ ప్యాట్ పనిచేయలేదని చెప్పారు. వెంటనే కొత్త వీవీ ప్యాట్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Betting On Result : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్‌లు

హుజూరాబాద్‌లో పోలింగ్‌ ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటింగ్‌ నమోదైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 84 శాతం పైగా పోలింగ్‌ నమోదవగా ఈ సారి అది 86.57 శాతానికి పెరిగింది. 2.5 శాతం పైగా పెరుగుదల నమోదైంది. కరీంనగర్‌లోని ఎస్‌.ఆర్‌.ఆర్‌.డిగ్రీ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. మంగళవారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడవనున్నాయి.

ఈవీఎంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల నిఘాలో స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రత కల్పించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ సీల్‌ చేశామన్నారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్‌లు భద్రతను పర్యవేక్షిస్తున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా డబ్బు పంపకాలు, ప్రలోభాలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 85 ఫిర్యాదులు వచ్చాయని, చర్యలు తీసుకుంటామని చెప్పారు.