Betting On Result : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్‌లు

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్‌ లో సర్వే చేసిన బెట్టింగ్‌ టీమ్స్‌.. ఎవరు గెలుస్తారని బెట్టింగులకు పాల్పడుతున్నారు.

Betting On Result : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్‌లు

Betting (1)

Huzurabad by-election : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సర్వే చేసిన బెట్టింగ్‌ టీమ్స్‌.. ఎవరు గెలుస్తారు..? ఎంత మెజార్టీతో గెలుస్తారంటూ బెట్టింగులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 50 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్‌లు జరిగి ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

హుజూరాబాద్ ఉపఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇప్పటికే బుకీలతో పాటు సర్వే టీమ్‌లు ల్యాండైపోయాయి. హుజూరాబాద్ పబ్లిక్ పల్స్ పట్టుకునేందుకు వాళ్లంతా తెగ ట్రై చేస్తున్నారు. కేవలం.. ఆన్‌లైన్‌లోనే వంద కోట్లకు పైగా బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. తెలంగాణ, ఏపీకి చెందిన వాళ్లు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఏపీ నుంచి కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు హుజూరాబాద్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచే కాకుండా.. మహారాష్ట్ర నుంచి బెట్టింగ్ సర్వే టీమ్స్‌ వచ్చినట్లు సమాచారం.

MLC Elections : తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఈ మధ్యే కొందరు.. ఆంధ్ర నాయకులు, వ్యాపారులు నేరుగా హుజూరాబాద్ వచ్చి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి వెళ్లారు. వీటిపై రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విజయవాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, విశాఖ, మహారాష్ట్ర, నాందేడ్, ముంబై నుంచి.. బెట్టింగ్ సర్వే టీమ్స్ వచ్చి…లెక్కలు వేసుకొని వెళ్లారు.

మరోవైపు హుజురాబాద్‌లో ప్రలోభాల పర్వం కొనసాగింది. ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు మద్యం, మాంసం పంచుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో నగదు పంపిణీ కూడా జోరుగా సాగినట్లు తెలుస్తోంది. ఇంటింటికి తిరిగి మరీ డబ్బు పంపిణీ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఒక్కో ఓటుకు 6 వేల రూపాయల చొప్పున ఎన్వలప్‌ కవర్‌లో పెట్టి మరీ అందించినట్లు వార్తలు వెల్లువెత్తాయి.

Petrol, Diesel Prices : దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..అక్టోబర్ లో 24 సార్లు పెంపు

హుజూరాబాద్‌లో పోలింగ్‌ ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడంతో.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటింగ్‌ నమోదైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 84 శాతం పైగా పోలింగ్‌ నమోదవగా ఈ సారి అది 86.57 శాతానికి పెరిగింది. 2.5 శాతం పైగా పెరుగుదల నమోదైంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌డిగ్రీ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. మంగళవారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడవనున్నాయి.

మరోవైపు.. హుజూరాబాద్‌ బైపోల్‌పై ఎగ్జిట్ పోల్స్‌ హీట్‌ పెంచేస్తున్నాయి. టీఆర్ఎస్.. బీజేపీ.. కాంగ్రెస్ సహా 35 మంది అభ్యర్థులు హుజూరాబాద్‌ బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం.. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే నెలకొంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెబుతుంటే.. మరికొన్ని సర్వేలు ఈటలదే విజయమంటున్నాయి.