Revanth Padayatra Protest : రేవంత్ రెడ్డి పాదయాత్రకు నిరసన సెగ.. ములుగు, నర్సంపేట పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు బీఆర్ఎస్ శ్రేణలు నుంచి నిరసన సెగ తగలింది. పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.

Revanth Padayatra Protest : రేవంత్ రెడ్డి పాదయాత్రకు నిరసన సెగ.. ములుగు, నర్సంపేట పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు

Revanth Padayatra

Revanth Padayatra Protest : ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు బీఆర్ఎస్ శ్రేణలు నుంచి నిరసన సెగ తగలింది. పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ప్రగతిభవన్ ను గ్రనేడ్లు పెట్టి పేల్చినా ఎలాంటి అభ్యంతరం లేదన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడీలను పేల్చినట్లు ప్రగతి భన్ గోడలను బద్దలు కొట్టాలని అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని బీఆర్ఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి ప్రాణానికి హాని తలపెట్టే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి నక్సలైట్లకు బహిరంగ పిలుపునిచ్చారని ఆరోపిస్తున్నారు. రెచ్చగొట్టే వాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కపై ములుగు, నర్సంపేట పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి, సీతక్కపై కుట్ర కేసు, పీడీ యాక్టు నమోదు చేయాలని ఫిర్యాదులో ఫేర్కొన్నారు.

Revanth Reddy Yatra : మేడారం నుంచే ఈ యాత్ర మొదలుపెట్టడానికి ఓ కారణం ఉంది: రేవంత్ రెడ్డి

ప్రగతి భవన్ ను పేల్చాలన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పెద్ది సుదర్శన్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మహాత్మ గాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా? దేశంలోని పీసీసీలు రేవంత్ తరహా కామెంట్స్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఇటు సొంతపార్టీ, అటు బీఆర్ఎస్ నుంచి వస్తున్న నిరసనలకు పిలుపుతో పాలిటిక్స్ హీటెక్కాయి.