BRS MLA Reaction : ఆ కక్షతోనే ఇలా- మహిళ ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రియాక్షన్

నేను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. మహిళ ఆరోపణల్లో నిజం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాటింగ్ నాది కాదు.(BRS MLA Reaction)

BRS MLA Reaction : ఆ కక్షతోనే ఇలా- మహిళ ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రియాక్షన్

BRS MLA Reaction : తనపై డెయిరీ నిర్వాహకురాలు చేసిన ఆరోపణలను ఖండించారు బెల్లంకొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. లోన్లు ఇస్తామని రైతులను వారు మోసం చేశారని, ఈ విషయం రైతులు తన దృష్టికి తీసుకురావడంతో పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించానన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలానే మోసం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. వారిని అరెస్ట్ చేయించానన్న కక్షతో ప్రతిపక్షాలతో కలిసి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాటింగ్ తనది కాదన్నారు ఎమ్మెల్యే.

Also Read..Allegations On MLA : కోరిక తీర్చాలని, అమ్మాయిలను పంపాలని వేధించారు-ఎమ్మెల్యేపై మహిళ తీవ్ర ఆరోపణలు

”నేను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. మహిళ ఆరోపణల్లో నిజం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాటింగ్ నాది కాదు. రైతులకు లోన్లు ఇప్పిస్తామని మోసం చేశారు. రైతులు నా దృష్టికి తీసుకురావడంతో అరెస్ట్ చేయించా. ఆ కక్షతోనే నాపై ఆరోపణలు చేస్తున్నారు” అని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివరణ ఇచ్చారు.(BRS MLA Reaction)

Also Read..Janakipuram Sarpanch Navya : కిరోసిన్‌ పోసి తగలబెడతా-ఎమ్మెల్యే పేరు ఎత్తకుండానే సర్పంచ్‌ నవ్య స్ట్రాంగ్ వార్నింగ్

రాత్రికి అమ్మాయిలను పంపాలని వేధించారు-ఎమ్మెల్యేపై మహిళ తీవ్ర ఆరోపణలు
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను వేధించారని, తప్పుడు కేసులు పెట్టారని, కోరిక తీర్చాలని ఒత్తిడి చేశారని ఓ ప్రైవేట్ డెయిరీ నిర్వాహకురాలు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read..MLA Rajaiah : ఎమ్మెల్యే రాజయ్య కంటతడి

తనతో ఎమ్మెల్యే చేసినట్లుగా చెబుతున్న వాట్సాప్ చాటింగ్ లను ఆమె బయటపెట్టారు. ఎమ్మెల్యే ఒత్తిడి భరించలేక బ్రోకర్ల సాయంతో అమ్మాయిలను పంపించానని ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కోరిక తీర్చాలని తనను కూడా ఆ ఎమ్మెల్యే వేధించినట్లు ఆమె ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే చాటింగ్, లొకేషన్ షేరింగ్ కు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో పెట్టిన చాటింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది.

డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి సహకరిస్తానంటూ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఆ మహిళ ఆరోపించారు. డెయిరీ సంస్థ విస్తరణ కోసం ఎమ్మెల్యే చెప్పినట్లు విన్నానని, హైదరాబాద్ కు వెళ్లినప్పుడల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయనకు సపర్యలు చేశాననన్నారు. అమ్మాయిలను పంపాలని ఒత్తిడి చేస్తే పంపానన్నారు. ఇంతచేసినా.. చివరికి తమపైనే ఆ ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టించి వేధించారని ఆమె వాపోయారు.