TPCC : భట్టితో పాటు 10 మంది సీనియర్లకు అధిష్టానం పిలుపు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయన నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపు రావడంతో పాదయాత్రకు తాత్కాలిక..

TPCC : భట్టితో పాటు 10 మంది సీనియర్లకు అధిష్టానం పిలుపు

Rahul Gandhi

Telangana Congress : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఫోకస్ పెట్టింది. అంతకంటే ముందు.. పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు, ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని భావించింది. అందులో భాగంగా సీనియర్ నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. రాహుల్ గాంధీతో వీరి భేటీ జరుగనుంది. దాదాపు 30 మందికి ఫోన్ కాల్స్ వచ్చాయని తెలుస్తోంది. ఏప్రిల్ 04వ తేదీన ఈ భేటీ జరుగనుందని తెలుస్తోంది. అయితే.. సీనియర్ నేత వీహెచ్, సీఎల్పీ నేత భట్టిలను మాత్రం ముందుగానే ఢిల్లీకి రావాలని చెప్పడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజకీయాలు, భవిష్యత్ ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది.

Read More : CM KCR : దేశం మొత్తం కేసీఆర్‌‌ను చూస్తుంది… విశ్వరూపం చూస్తారు – బాచంపల్లి సంతోష్ కుమార్

ప్రస్తుతం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయన నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపు రావడంతో పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ వేయనున్నారు. 2022, ఏప్రిల్ 03వ తేదీ నుంచి ఏప్రిల్ 06వ తేదీ వరకు పాదయాత్రను నిలిపివేయనున్నారు. 7వ తేదీ నుంచి మరలా పాదయాత్ర చేపట్టనున్నారు. గతంలో కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యే రాహుల్ కొద్దిసేపు మాత్రమే చర్చిస్తుంటారు. కానీ.. ఈసారి జరిగే ఈ మీటింగ్ దాదాపు మూడు గంటల పాటు ఉండనుందని తెలుస్తోంది.

Read More : Gold Smuggling : పద్మావతి ట్రావెల్స్‌లో మూడేళ్లుగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్!

ఇక తెలంగాణ కాంగ్రెస్ విషయానికి వస్తే.. అంతర్గత విబేధాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ ను కొంతమంది టార్గెట్ చేస్తూ.. బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి ఏకంగా పార్టీ అధిష్టానానికి లేఖలు రాయడం, రేవంత్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అధిష్టానం జోక్యంతో జగ్గారెడ్డి కాస్తా మెత్తబడ్డారు. తాజాగా.. సీనియర్ నేతలకు పిలుపు రావడంతో ఎలాంటి అంశాలపై చర్చిస్తారో చూడాలి.