Cat Fish Tension : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్యాన్సర్ ముప్పు తెచ్చే క్యాట్ ఫిష్ కలకలం

క్యాట్ ఫిష్.. అచ్చం కొరమీను రూపంలోనే ఉంటుంది. కానీ, అది కొరమీను కాదు.. బతుకులను కొరికేసే కిల్లీ ఫిష్.(Cat Fish Tension)

Cat Fish Tension : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్యాన్సర్ ముప్పు తెచ్చే క్యాట్ ఫిష్ కలకలం

Cat Fish (1)

Cat Fish Tension : క్యాట్ ఫిష్.. అచ్చం కొరమీను రూపంలోనే ఉంటుంది. మీసాలు తప్ప కొరమీను రూపంలో కనిపిస్తుంది. కానీ, అది కొరమీను కాదు.. బతుకులను కొరికేసే కిల్లీ ఫిష్. భద్రాది కొత్తగూడెం జిల్లాలో క్యాట్ ఫిష్ కలకలం రేపింది. బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ క్రాస్ రోడ్ దగ్గర చేపల లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో చేపలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. స్థానికులు వాటి కోసం ఎగబడ్డారు. అరగంటలో చేపల లోడుని ఖాళీ చేసేశారు. అయితే, లారీ నుంచి బయటపడిన వాటిలో క్యాట్ ఫిష్ ను పోలిన చేపలు ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

అదుపు తప్పడంతోనే లారీ బోల్తా పడింది. దొరికినవి దొరికినట్లుగా చేపలు తీసుకుని స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేపలు పూర్తిగా లూటీ అయిపోయాయి. అయితే జనాలు తమ ఇళ్లకు తీసుకెళ్లిన చాలా చేపల్లో క్యాట్ ఫిష్ ను పోలి ఉండటం ఇప్పుడు కొత్త భయాలను రేపుతోంది.(Cat Fish Tension)

Fish lorry: బోల్తాపడ్డ లారీ.. నిమిషాల్లో చేపలు మాయం..

రేపు మృగశిర కార్తె. ఈ రోజున చేపలను తినాలనే నానుడి ఉంది. దీంతో మృగశిర కార్తె రోజున చాలామంది చేపలు తీసుకోవడం కామన్. ఈ క్రమంలో విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ఒడిశాకు చేపలను తరలిస్తున్నారు. అయితే, చేపల లోడ్ తో వెళ్తున్న లారీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోల్తా కొట్టింది. చేపలన్నీ రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వందల సంఖ్యలో లారీ దగ్గరికి వచ్చారు. తమ వెంట తెచ్చుకున్న కవర్లు, సంచుల్లో దొరికినవి దొరికినట్లుగా చేపలను తీసుకెళ్లారు. చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. అరగంటలోనే చేపల లోడ్ ఖాళీ అయిపోయింది. అయితే, బోల్తా పడిన చేపల లారీలో క్యాట్ ఫిష్ బయటపడింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

కాగా, తెలంగాణలో క్యాట్ ఫిష్ తినడంపై నిషేధం ఉంది. కాగా.. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో మాత్రం క్యాట్ ఫిష్ తింటుంటారు. ఏపీలోని కృష్ణా కారిడార్ పక్కన ఉన్న ప్రాంతాల్లో క్యాట్ ఫిష్ ను పెంచుతూ అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. క్యాట్ ఫిష్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వీటిని తీసుకోవం వల్ల క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది. దీంతో క్యాట్ ఫిష్ తినడంపై బ్యాన్ విధించారు. అయితే క్యాట్ ఫిష్ విషయం తెలియని స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. తీరా, అందులో క్యాట్ ఫిష్ ఉందని తెలిసి కంగారుపడుతున్నారు. మరోవైపు అధికారులు అలర్ట్ అయ్యారు. క్యాట్ ఫిష్ తీసుకెళ్లిన వారంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Thailand : నీటిలోంచి ఎగిరి వచ్చి జాలరి గొంతులో ఇరుక్కుపోయిన చేప..

లారీలో 8 నుంచి 10 టన్నుల వరకు చేపలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అందులో కొరమీను, వలుగా వంటి పలు రకాల చేపలు ఉన్నాయి. అలాగే, నిషేధం విధించిన క్యాట్ ఫిష్ కూడా ఆ చేపల్లో ఉన్నట్లు గుర్తించడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.