CM KCR Criticized : ప్రధాని మోదీకి భజన మండలిగా మారిన నీతి ఆయోగ్ : సీఎం కేసీఆర్

నీతి ఆయోగ్..ప్రధాని మోదీ చెప్పే వాటికి భజన మండలిగా మారిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్.. ప్లానింగ్ కమిషన్ కన్నా మెరుగ్గా పని చేస్తుందనుకున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ కు వ్యూహం లేదు.. ఇందులో రాష్ట్రాల పాత్ర లేదన్నారు. నీతి ఆయోగ్ నిరర్ధక సంస్థగా మారిపోయిందని విమర్శించారు. ప్రణాళికా సంఘానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో నిర్ధిష్టమైన వ్యూహం ఉందేదని చెప్పారు.

CM KCR Criticized : ప్రధాని మోదీకి భజన మండలిగా మారిన నీతి ఆయోగ్ : సీఎం కేసీఆర్
ad

CM KCR criticized : నీతి ఆయోగ్..ప్రధాని మోదీ చెప్పే వాటికి భజన మండలిగా మారిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్.. ప్లానింగ్ కమిషన్ కన్నా మెరుగ్గా పని చేస్తుందనుకున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ కు వ్యూహం లేదు.. ఇందులో రాష్ట్రాల పాత్ర లేదన్నారు. నీతి ఆయోగ్ నిరర్ధక సంస్థగా మారిపోయిందని విమర్శించారు. ప్రణాళికా సంఘానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో నిర్ధిష్టమైన వ్యూహం ఉందేదని చెప్పారు. రాష్ట్రాల బడ్జెట్ రూపకల్పనలో కూడా సహకరించేదని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ ఏడేళ్ల తర్వాత ఏం కనిపిస్తోంది?.. నీతి ఆయోగ్ పెద్ద జోక్ గా మారిపోయిందని చెప్పారు. నేతి భీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో..నీతి ఆయోగ్ లో నీతి అలా ఉందన్నారు.

దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నప్పటికీ కూడా చెన్నై లాంటి సిటీ బకెట్ నీళ్ల కోసం తన్నులాడుకోవాలా అని అడిగారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ లక్షా 90 వేల కోట్లు పథకాల కోసం ఖర్చు పెట్టిందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది రూ. 5 వేల కోట్లేనని చెప్పారు. తాము పంపిన ప్రతిపాదలన్ని బుట్టదాఖలు చేశారని తెలిపారు. తమ ప్రతిపాదనలపై నీతి ఆయోగ్ లో కనీసం చర్చించలేదని వాపోయారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ఒక్కసారైనా నీతి ఆయోగ్ లో చర్చించారా అని ప్రశ్నించారు. ఆర్మీలో పాలసీలు మారుస్తున్నట్లు నీతి ఆయోగ్ లో చర్చించారా అని నిలదీశారు.

CM KCR Criticized : కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బ తీస్తున్నాయి : సీఎం కేసీఆర్

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీములు మంచివని నీతి ఆయోగ్ చెప్పిందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని సూచిందన్నారు. కానీ కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సులను బుట్టదాఖలు చేస్తే దానికున్న విలువేంటని ప్రశ్నించారు. మిషన్ భగీరథలో చేసిన పనుల్ని జల్ జీవన్ మిషన్ కింద చూపిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి బ్రేకులు వేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలో మార్పులతో రుణ సేకరణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.