CM KCR: నిపుణుల రిపోర్ట్ రాగానే.. 111 జీవోను ఎత్తేస్తాం: సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన 111 జీవోపై.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణుల కమిటీ నివేదిక తమకు అందగానే.. ఈ జీవోను ఎత్తేస్తామని సంచలన ప్రకటన చేశారు.

CM KCR: నిపుణుల రిపోర్ట్ రాగానే.. 111 జీవోను ఎత్తేస్తాం: సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

Cm Kcr 2

CM KCR: కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన 111 జీవోపై.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణుల కమిటీ నివేదిక తమకు అందగానే.. ఈ జీవోను ఎత్తేస్తామని సంచలన ప్రకటన చేశారు. అసలు.. ఈ జీవోనే అర్థరహితమని తేల్చి చెప్పారు. గతంలో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిరక్షణ కోసం ఈ జీవోను తీసుకువచ్చారని గుర్తు చేశారు.

హైదరాబాద్ కు ఈ జలాశయాలు ఇప్పుడు అవసరం లేదన్నారు. తెలంగాణ రాజధానికి కృష్ణా, గోదావరి జలాలను తరలిస్తున్నామని.. ఇంకో వందేళ్ల వరకూ హైదరాబాద్ కు నీటి కొరత ఉండదని స్పష్టం చేశారు.. కేసీఆర్. ఈ విషయంలో అధికారులు ఇప్పటికే పని చేస్తున్నారని.. ఉన్న ఫళంగా ఎత్తేస్తే జీవో పరిధిలో ఉన్న లక్షా 32 వేల 600 ఎకరాల భూముల పరిస్థితిలో కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పిన ముఖ్యమంత్రి.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని శాసనసభలో వెల్లడించారు.

హైదరాబాద్ కు కొన్ని దశాబ్దాల పాటుగా తాగునీటికి ప్రధాన వనరుగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కాలుష్యం నుంచి కాపాడేందుకు.. 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. ఈ ఉత్తర్వులను అమలు చేసింది. ఆ 2 రిజర్వాయర్ల పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టకుండా.. భవనాన్ని జీ +2కి మించకుండా మాత్రమే నిర్మించుకోవాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఆ రెండు రిజర్వాయర్ల పరిధిలోని చాలా ప్రాంతాలు.. ఈ జీవో పరిధిలోకి వస్తాయి. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో.. 1996 నుంచి.. జంట జలాశాయల పరిధిలోని చాలా నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయమై ఇప్పుడు కేసీఆర్.. అసెంబ్లీలో చేసిన ప్రకటన.. సంచలనంగా మారింది.

Read More:

Triple One Go : రాజకీయ నేతలకు వరంలా మారిన జీవో నంబర్ 111

జీవో నెం .111కు తూట్లు..!