CM KCR: నేడు యాదగిరి గుట్టకు సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యం ..

సీఎం కేసీఆర్ ఇవాళ యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. సతీసమేతంగా వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పించనున్నారు.

CM KCR: నేడు యాదగిరి గుట్టకు సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యం ..

CM KCR

CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. సతీసమేతంగా వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పించనున్నారు. యాదగిరిగుట్టకు సీఎం వస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 10.30గంటలకు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.30 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు యాదగిరి గుట్టకు చేరుకుంటారు. అనంతరం స్వామివారిని దర్శించుకుటారు.

CM KCR: సీఎం కేసీఆర్‌తో ‘లోక్ మత్’ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా సమావేశం

ప్రధాన ఆలయం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముకులు, భక్తులు, స్వామివారికి పసిడి సమర్పించారు. తానూ కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఆ ప్రకటనకు కట్టుబడి స్వర్ణాన్ని స్వామివారికి సమర్పించనున్నారు. ఇదిలాఉంటే సీఎం కేసీఆర్ యాదగిరి గుట్ట పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తు వేగవంతం చేశారు. వచ్చేనెల 5వ తేదీన దసరా రోజు జాతీయ పార్టీ ఏర్పాటుతో పాటు పార్టీ పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇప్పటికే జాతీయ పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ పలుసార్లు ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ బీజేపీయేతర పార్టీల నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడ, గుజరాత్ మాజీ సీఎంతో పాటు పలువురు ముఖ్యనేతలతో కేసీఆర్ వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మినహా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషించేందుకు కేసీఆర్ చర్యలు వేగవంతం చేశారు. తాజాగా భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ వచ్చే నెల 5న దసరా రోజు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.