CM KCR: సీఎం కేసీఆర్‌తో ‘లోక్ మత్’ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా సమావేశం

మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సీనియర్ సభ్యుడు, ‘లోక్ మత్ ’ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

CM KCR: సీఎం కేసీఆర్‌తో ‘లోక్ మత్’ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా సమావేశం

CM KCR

CM KCR: మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సీనియర్ సభ్యుడు, ‘లోక్ మత్ ’ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్ తో దర్డా చర్చించారు. కేంద్రంలోని బీజేపీ అసంబద్ధ పాలనతో రోజురోజుకూ అన్ని రంగాలు దిగజారిపోతున్నాయని, సామాజిక సంక్షుభిత వాతావరణం నెలకొంటున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రతిష్టను దిగజార్చే ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రత్యామ్న్యాయ రాజకీయ నాయకత్వం దేశానికి తక్షణ అవసరమని చర్చల సందర్భంగా విజయ్ దర్డా అన్నారు.

Sachin Pilot: నేను మాట్లాడుతుంటే సోనియా శ్రద్ధగా విన్నారు.. సమావేశం అనంతరం పైలట్

శాంతియుత పార్లమెంటరీ పంథాలో ఉద్యమాలు నిర్వహించి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం గొప్ప విషయమని, కొద్దికాలంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టి దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిదుతున్న తీరు అమోఘమన్నారు. ఇంతటి పట్టుదల, ధైర్యం, రాజనీతిజ్జత, దార్శనికత కలిగిన రాజకీయ నాయకత్వం సమకాలీన రాజకీయాల్లో తెలంగాణనుంచి ఎదగడం దేశానికి శుభ సూచకమని అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సీఎం కేసీఆర్ రాజకీయ పాలనానుభవం కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ ప్రజల గుణాత్మాకాభివృద్ధికి దోహదపడాల్సిన అవసరమున్నదన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని కేసీఆర్‌ను విజయ్ దర్డా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విజయ్ దర్డాను శాలువాతో సత్కరించి, జ్జాపికను అందచేశారు. తాను రచించిన ‘రింగ్ సైడ్ ’ పుస్తకాన్నివిజయ్ దర్డా సీఎం కేసీఆర్ కు అందజేశారు.