Sachin Pilot: నేను మాట్లాడుతుంటే సోనియా శ్రద్ధగా విన్నారు.. సమావేశం అనంతరం పైలట్

సోనియా గాంధీతో మాట్లాడాను. నేను మాట్లాడుతుంటే ఆమె ప్రశాంతంగా విన్నారు. జైపూర్, రాజస్తాన్‭ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడాము. నాకున్న సెంటిమెంట్ల గురించి ఆమెతో చెప్పాను. అలాగే రాష్ట్రంలోని పరిస్థితపై నా ఫీడ్ బ్యాక్ ఇచ్చాను. వాస్తవానికి వచ్చే ఎన్నికల గురించి మేము ఆలోచిస్తున్నాం. 2023లో రాజస్తాన్‭లో మళ్లీ గెలవాలన్నదే మా కోరిక

Sachin Pilot: నేను మాట్లాడుతుంటే సోనియా శ్రద్ధగా విన్నారు.. సమావేశం అనంతరం పైలట్

She listened to me calmly says Sachin Pilot after meeting with Sonia

Sachin Pilot: రాజస్తాన్ పరిణామాలతో పాటు ఇతర అంశాలపై నిర్ణయం తీసుకునేది సోనియా గాంధీయేనని రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. రాజస్తాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని కలుసుకున్నారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. నేరుగా సోనియా నివాసానికే వెళ్లి సమావేశమయ్యారు. అనంతరం ఈ సమావేశం గురించి మీడియాతో మాట్లాడారు.

‘‘సోనియా గాంధీతో మాట్లాడాను. నేను మాట్లాడుతుంటే ఆమె ప్రశాంతంగా విన్నారు. జైపూర్, రాజస్తాన్‭ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడాము. నాకున్న సెంటిమెంట్ల గురించి ఆమెతో చెప్పాను. అలాగే రాష్ట్రంలోని పరిస్థితపై నా ఫీడ్ బ్యాక్ ఇచ్చాను. వాస్తవానికి వచ్చే ఎన్నికల గురించి మేము ఆలోచిస్తున్నాం. 2023లో రాజస్తాన్‭లో మళ్లీ గెలవాలన్నదే మా కోరిక. రాజస్తాన్ అంశంలో ఏ నిర్ణయమైనా సోనియానే తీసుకుంటారు. వచ్చే 12-13 నెలల్లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది’’ అని పైలట్ అన్నారు.

Sachin Pilot Meets Sonia: సోనియాగాంధీతో సచిన్ పైలట్ భేటీ.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కీలక మార్పులు తప్పవా?

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గురువారం సోనియాతో భేటీ అయ్యారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న గెహ్లాట్ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్ ను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. ఈక్రమంలో రాజస్థాన్ సీఎం పదవిని వదులుకొని జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు గెహ్లాట్ విముఖత వ్యక్తం చేశాడు. దీనికితోడు ఆదివారం సాయంత్రం పైలట్ తదుపరి ముఖ్యమంత్రి కావడాన్ని వతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రాజస్థాన్ శాసనసభ్యులు రాజీనామా చేయడం రాష్ట్రంలో తీవ్ర సంక్షోభానికి దారి తీసింది.

Ashok Gehlot: తన గోతి తానే తవ్వుకున్న గెహ్లాట్.. అధ్యక్ష పదవి ఔట్, సీఎం పదవి హుళక్కే!