Covid Precaution: టెన్త్ లోపు బడులన్నీ మూసేస్తేనే మేలంటోన్న అధికారులు

పదో తరగతిలోపు పాఠశాలలను, వసతిగృహాలను, గురుకులాలను వెంటనే మూసివేస్తేనే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం.

Covid Precaution: టెన్త్ లోపు బడులన్నీ మూసేస్తేనే మేలంటోన్న అధికారులు

Covid Precaution

Covid Precaution: పదో తరగతిలోపు పాఠశాలలను, వసతిగృహాలను, గురుకులాలను వెంటనే మూసివేస్తేనే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేయొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పాఠశాలలు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి వాహకులుగా మారుతున్నట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు ఇప్పటికే కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అంచనా. పిల్లల్లో రోగ నిరోధకశక్తి సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. వీరికొ కొవిడ్ పాజిటివ్ వచ్చినా లక్షణాలు బయటికి కనిపించవు. అందుకే తరగతులకు హాజరై ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ప్రజలకు, కుటుంబ సభ్యులకు కరోనా వ్యాపించడానికి వాహకాలవుతున్నారని వైద్యుల అంచనా వేస్తున్నారు. అందువల్లనే మార్చి నెలారంభం నుంచి కరోనా రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని భావిస్తున్నారు.

నిజానికి 2020 సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్దగా లేవు. పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలలో పెరుగుతూ వస్తున్నాయి. అక్కడి నుంచి నిత్యం వేలమంది తెలంగాణకు రాకపోకలు సాగిస్తుంటారు. వారి నుంచీ వైరస్‌ తెలంగాణలోకి వేగంగా వ్యాపిస్తోందని వైద్యశాఖ భావిస్తోంది. అక్కడి నుంచి విద్యార్థులకు.. వ్యాప్తి చెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి పాఠశాలలు, కాలేజీలు, గురుకులాలు మూసివేస్తేనే మంచిదని హెల్త్ డిపార్ట్‌మెంట్ భావిస్తోంది.

రెండో రకం స్ట్రెయినేనా…
ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ 300 మందికి పైగా పాజిటివ్‌ తేలుతున్నందున వీరికి సోకింది కరోనా సెకండ్‌ వేవ్‌ స్ట్రెయినేనా అని వైద్యులు అనుమానిస్తున్నారు. ఏ రకమో నిర్ధారించేందుకు పరీక్షలు చేస్తున్నారు. అది తేలితేనే కంట్రోలింగ్‌పై అంచనాకు వచ్చే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉన్నా తెలంగాణలోకి రాలేదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదిరోజులుగా పరిస్థితులు క్రమంగా మారుతూ, రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.