కరోనా నివారణకు ఆయుర్వేదిక్ మెడిసిన్

  • Published By: Subhan ,Published On : May 9, 2020 / 08:23 AM IST
కరోనా నివారణకు ఆయుర్వేదిక్ మెడిసిన్

కొవిడ్-19 నివారణ కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ క్లినికల్ రీసెర్చ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), ఆయుష్ మినిస్ట్రీతో కలిపి నాలుగు ఆయుర్వేదిక్ ఫార్ములాలపై టెస్టులు నిర్వహించనుంది. అశ్వగంధ, యష్టిమధు, గుడుచి పీప్లి, ఆయుష్ 64మందులపై రీసెర్చ్ చేసేందుకు సిద్ధమయ్యారు. 

ఈ ఆయుర్వేదిక్ ఫార్ములాలను హెల్త్ వర్కర్లు, హై రిస్క్ జోన్లలో పనిచేసే వారి సాయంతో వినియోగిస్తారు. సంజీవని యాప్ ద్వారా 50లక్షల మందిపై ఈ టెస్టులు నిర్వహిస్తారు. డైరక్టర్ జనరల్ శేఖర్ మండే మాట్లాడుతూ.. ‘ఆయుష్ కోణంలో టెస్టులు నిర్వహిస్తున్నాం. మన సాంప్రదాయక జ్ఞానం చాలా గొప్పది. ఏళ్ల నాటి సంస్కృతి మనది. ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా మోడరన్ సైన్స్ సైతం దీనిని వాడుకుంటుంది. 

యూనివర్సిటీ గ్రాంట్ మిషన్ వైస్ ఛైర్మన్ డా.భూషణ్ పట్వార్ధన్ ఆధ్వర్యంలో ఈ ప్రోసెస్ మొదలుపెట్టారు. కొవిడ్ 19 పాజిటివ్ కేసులపై దీనిన ప్రయోగించి నిపుణుల ద్వారా ఫార్ములాను మెరుగుచేస్తారు. ఆయుష్ సంజీవని మొబైల్ యాప్ సాయంతో 5మిలియన్ మంది టార్గెట్ గా దీని పరీక్షలు చేస్తారు. 

Read More :

ప్రపంచంలో కరోనా కేసులు ఎన్నో తెలుసా

కోవిడ్-19 డిశ్చార్జ్‌కి మార్గదర్శకాలు సవరించిన కేంద్రం