Telangana Marijuana : వారికి రైతు బంధు కట్… 148 మంది రైతులపై కేసులు

సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నారాయణ్‌ఖేడ్‌, మహబూబాబాద్‌, జహీరాబాద్‌, వరంగల్‌, భూపాలపల్లి, ఆదిలాబాద్‌...

Telangana Marijuana : వారికి రైతు బంధు కట్… 148 మంది రైతులపై కేసులు

Raithubandhu

Cut The Rythu Bandhu : రైతులకు ఇస్తున్న రైతు బంధు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి పండిస్తున్న రైతులకు రైతు బంధు కట్ చేయాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. 148 మంది రైతులపై 121 కేసులు నమోదు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నారాయణ్‌ఖేడ్‌, మహబూబాబాద్‌, జహీరాబాద్‌, వరంగల్‌, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌కి చెందిన రైతులు గంజాయి పండిస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. జూన్‌లో వస్తున్న రైతు బంధును రైతులకు ఇవ్వొద్దని ఎక్సైజ్‌శాఖ లేఖలో వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేటలో సైతం గంజాయి పండిస్తున్న రైతుల వివరాలు సేకరించారు. 148 మంది రైతుల ఆధార్‌ కార్డులు, ల్యాండ్ డాక్యుమెంట్లను కలెక్టర్లకు పంపింది ఎక్సైజ్‌శాఖ.. శీలావతి అనే మహిళా రైతు గంజాయి మొక్కలను పండిస్తున్నట్టు గుర్తించారు.

Read More : Tobacco Farming: పొగాకు సాగుతో నాలుగింతల లాభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గంజాయి సాగు నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిని సాగు చేస్తున్న రైతుల వివరాలను గుర్తించి ప్రభుత్వం అందించే రైతు బంధును ఆపాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలు కష్టాలకు గురికాకుండా ఉండేందుకు వారికి అండగా నిలవాలని రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ. 5 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే.. కొంతమంది రైతులు వ్యవసాయానికి కాకుండా గంజాయి సాగును చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇలాంటి రైతులపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంజాయి సాగు చేస్తున్న రైతులను గుర్తించి.. వారికి రైతు బంధు కట్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎక్సైజ్‌శాఖ రంగంలోకి దిగింది. గంజాయి సాగు చేస్తున్న రైతులను గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బంధు పథకాన్ని నిలిపివేయనున్నారు.