Cyber Crime : వీడియో కాల్ చేసి బాత్‌రూమ్‌లోకి వెళ్లమన్నారు.. ఆ తర్వాత

సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఎత్తాలంటే బయటపడుతున్నారు చాలామంది.

Cyber Crime : వీడియో కాల్ చేసి బాత్‌రూమ్‌లోకి వెళ్లమన్నారు.. ఆ తర్వాత

Cyber Crime

Cyber Crime :  సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఎత్తాలంటే బయటపడుతున్నారు చాలామంది. సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా సందేశాలు, కాల్స్ చేసి మాటలు కలిపి ముగ్గులోకి దింపి దారుణంగా మోసం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య అధికమయ్యారు. ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పెట్టి, దాని ద్వారా ఫోన్ నెంబర్ సంపాదించి వాట్సాప్ ద్వారా టచ్‌లోకి వస్తారు.

చదవండి : Cyber Crime : సెల్ ఫోన్ హ్యాక్ చేసి రూ.25 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఆ తర్వాత వీడియో కాల్ చేసి మాటల్లో పెట్టి న్యూడ్‌గా మాట్లాడాలని కోరుతారు. వారిమాటలు నమ్మి ఎవరైనా న్యూడ్‌గా మాట్లాడితే ఇక వారు బుక్ అయినట్లే.. ఆ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగుతారు. తాము అడిగినంత ఇవ్వాలని కోరతారు. ఆలా ఇవ్వకపోతే వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరిస్తారు.

చదవండి : UN Cyber Attack : ఐక్యరాజ్య సమితిపై సైబర్ దాడి.. కీలక డేటా హ్యాక్.. ఎలా జరిగిందంటే?

కొందరు వారు అడిగినంత ఇచ్చి వదిలించుకుంటారు. మరికొందరు వారి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. ఇక ఇలాంటి సైబర్ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు విడిచిన వారు చాలామందే ఉన్నారు. తాజాగా మెదక్ జిల్లా మనోహరాబాద్‌‌లో ఇటువంటి ఘటన జరిగింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రానికి చెందిన డిగ్రీ విద్యార్థికి ఇటువంటి అనుభవం ఎదురైంది.

చదవండి : Cybercrime : కాల‌భైర‌వ పూజ‌ చేయిస్తా..మెడిక‌ల్ ఎగ్జామ్ పాస్ చేయిస్తా.. అంటూ విద్యార్ధిని దోచేసిన కేటుగాడు

ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ చేసి ఆ తర్వాత మెల్లిగా ఫోన్ నెంబర్ లాగి మాటలు కలిపి వాట్సాప్ న్యూడ్ కాల్ మాట్లాడింది ఓ యువతి.. దానిని రికార్డు చేసి బెదిరింపులకు దిగింది. దీంతో బాధితుడు రూ.14,133 ఫోన్ పే చేశాడు. రెండు రోజులు కామ్ గా ఉంది మళ్లీ డబ్బులు అడగడం ప్రారంభించింది దీంతో అతడు మనోహరాబాద్ పోలీసులకు తెలిపాడు. విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎస్ఐ రాజు తెలిపారు.