CP Sajjanar : సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ.. కొత్త సీపీగా స్టీఫెన్ రవీంద్రా

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

CP Sajjanar : సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ.. కొత్త సీపీగా స్టీఫెన్ రవీంద్రా

Cyberabad Cp Sajjanar Transfered As Ts Rtc Md

Cyberabad CP Sajjanar Transfer : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు ఏళ్లకు పైగా సైబరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్‌ సేవలు అందించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా సజ్జనార్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించారు. 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ముత్యాల స్టీఫెన్ రవీంద్రను నియమిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.

సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా సజ్జనార్ కీలకమైన కేసులను పరిష్కరించారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళ రక్షణకు వినూత్నమైన కార్యక్రమాలను కూడా సజ్జనార్ చేపట్టారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సజ్జనార్. ఆయన కీలకమైన కేసులను పరిష్కరించిన ఐపీఎస్‌గా సజ్జనార్‌కు దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత సజ్జనార్ పేరు దేశమంతా మార్మోగింది. మూడు సంవత్సరాలకు పైగా సైబరాబాద్ సీపీగా సజ్జనార్ సేవలు అందించారు.
తెలంగాణలో ఫస్ట్ టైమ్..ట్రాన్స్ జెండర్లతో సీపీ సజ్జనార్ సమావేశం

కీలకమైన కేసులను పరిష్కరించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించి సజ్జనార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహిళల రక్షణకు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో సజ్జనార్ ఒక్కసారిగా సంచలనంగా మారారు. అంతకుముందు వరంగల్‌లో యాసిడ్ దాడి నిందితుడి ఎన్‌కౌంటర్‌తోనూ ఆయన గుర్తింపు పొందారు. సజ్జనార్ స్థానంలో స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్‌ను నియమించింది. ఆ తర్వాతే సైబరాబాద్ సీపీని బదిలీ చేసింది. స్టీఫెన్ రవీంద్ర.. పోలీస్ శాఖలో సమర్థుడైన అధికారిగా పేరు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్‌ ఆటకట్టించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.