Demand for Houses : హైదరాబాద్‌లో ఇళ్లకు భలే గిరాకీ!

హైదరాబాద్ మరోసారి టాప్ లేపింది. ఐతే ఈసారి రియల్ ఎస్టేట్‌లో ! కోవిడ్ సమయంలోనూ భాగ్యనగరంలో పెరిగిన ఇళ్ల గిరాకీ భారీగా పెరిగింది. అంతటా అలానే ఉంది అనుకుంటే.. ఖాళీ ల్యాండ్‌లో కాలేసినట్లే !

Demand for Houses : హైదరాబాద్‌లో ఇళ్లకు భలే గిరాకీ!

Demand For Houses In Hyderabad City

Demand for Houses : హైదరాబాద్ మరోసారి టాప్ లేపింది. ఐతే ఈసారి రియల్ ఎస్టేట్‌లో ! కోవిడ్ సమయంలోనూ భాగ్యనగరంలో పెరిగిన ఇళ్ల గిరాకీ భారీగా పెరిగింది. అంతటా అలానే ఉంది అనుకుంటే.. ఖాళీ ల్యాండ్‌లో కాలేసినట్లే ! మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఈ పరిస్థితి కనిపించింది. శతాబ్ధాల చరిత్ర ఉన్న హైదరాబాద్.. చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను క్రియేట్ చేసుకుంటోంది. దేశంలో ఏ నగరానికి లేని ఎన్నో ప్రత్యేకతలు భాగ్యనగరానికి సొంతం ! ఆకలి తీరుస్తోంది.. అవకాశాలు అందిపుచ్చుకునేలా చేస్తోంది.

ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పట్టుకొని పరిచయం చేస్తున్నట్లు హైదరాబాద్ అనిపిస్తుంది ఎవరికైనా ! నెలకు ఐదు వేలు సంపాదించే వ్యక్తి నుంచి ఐదు కోట్లు సంపాదించే వాళ్ల వరకు.. అందరికీ ఆశ్రయం ఇస్తుంది భాగ్యనగరం. చరిత్ర దాటుకొని వచ్చి చూసినా.. ఎన్నో విపత్తులను ఎదుర్కొంది ప్రతీసారి బౌన్స్ బ్యాక్ అయింది. ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకునే స్థాయికి ఎదిగింది. అలాంటి హైదరాబాద్‌కు సంబంధించి ఇప్పుడొక విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది.

మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే స్పెషల్ :
హైదరాబాద్‌లో ఇళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. దేశం మొత్తం ఇలానే ఉందిలే అనుకుంటున్నారేమో.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. భాగ్యనగరం స్పెషల్ అనిపిస్తోంది. గతేడాది చివరి త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగిన పరిస్థితి హైదరాబాద్‌‌లోనే కనిపిస్తోందని రియల్‌ ఎస్టేట్‌ సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్‌ విడుదల చేసిన గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ క్యూ4, 2020 నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంతో పోలిస్తే.. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 0.20 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. అదే సమయంలో బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ నగరాల్లో ధరలు తగ్గుముఖం పట్టాయ్. చెన్నైలో అధికంగా ఇళ్ల ధరలు 9శాతం తగ్గినట్లు ఈ నివేదిక వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ 122స్థానం :
గతేడాది చివరి ఫైనాన్షియల్ క్వార్టర్‌లో ఇళ్ల ధరలు అనూహ్యంగా పెరిగాయ్. ఆ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ 122స్థానం దక్కించుకుంది. హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు 129 ప్లేసులో ఉండగా.. అహ్మదాబాద్‌ 143, ముంబై 144, ఢిల్లీ 146, కోల్‌కతా 147, పుణె 148 స్థానాల్లో నిలిచాయ్. 150వ ర్యాంక్‌తో చెన్నై అట్టడుగు స్థానం నిలిచింది. గతేడాది నుంచి కోవిడ్ భయాలు ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్నాయ్. ఇలాంటి సమయంలో రూపాయి ఖర్చు పెట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ మిగతా మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలు పడిపోతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం గిరాకీ మరింత పెరిగింది.

127శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు :
2020 అన్ని త్రైమాసికాల్లో దేశంలో ఇళ్ల ధరలు పెరిగిన ఏకైక నగరం హైదరాబాద్‌ మాత్రమే! బెంగళూరులో ఇళ్ల ధరలు 0.8 శాతం తగ్గగా… అహ్మదాబాద్‌లో 3.1, ముంబైలో 3.2 శాతం, ఢిల్లీ 3.9 శాతం, కోల్‌కతా 4.3 శాతం, పుణె 5.3 శాతం మేర ధరలు పడిపోయాయ్. గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో…, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలతో కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 127శాతం పెరిగాయ్. కోవిడ్ మహమ్మారి ముంచుకొచ్చినా.. ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయ్. గతేడాది మొత్తం మీద లెక్కలేస్తే.. ధరలు ఏ నెలకానెల పెరుగుతూ వచ్చాయి.

కోవిడ్ కారణంగా ప్రపంచం అంతా.. రివర్స్ బటన్ నొక్కినట్లు అనిపిస్తే.. హైదరాబాద్ మాత్రం స్పెషల్ అనిపించింది. కరోనా సమయంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని ప్రజలు భావించడం, ఇళ్ల ధరలు కొద్దిగా తగ్గిపోవడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడమే ఇందుకు కారణమనిముఖ్యంగా ఇళ్ల కొనుగోలు విషయంలో అది స్పష్టంగా కనిపించింది. భాగ్యనగరానికి మాత్రమే పరిమితమైన కొన్ని ప్రత్యేకతల కారణంగా ఈ పరిస్థితి కనిపించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.