Telangana : డ్రోన్ల ద్వారా కొవిడ్ మందులు, టీకాల పంపిణీ..ఎంత దూరమైనా అనుమతి

దూర ప్రయాణ సామర్థ్యం గల డ్రోన్లను అద్దెకు తీసుకుని..వినియోగించుకొనేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈనెల మూడో వారం లేదా..జూన్ మొదటి వారంలో డ్రోన్ల ద్వారా కరోనా మందులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Telangana : డ్రోన్ల ద్వారా కొవిడ్ మందులు, టీకాల పంపిణీ..ఎంత దూరమైనా అనుమతి

Covid-19 Vaccines

Covid Drugs : తెలంగాణలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 4 నుంచి 5 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా కలవర పెడుతోంది. ఈ క్రమంలో..వ్యాక్సినేషన్, టీకాల పంపిణీ  ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా కార్యక్రమాలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే..దూర ప్రాంతాలకు వ్యాక్సిన్ పంపిణీ చాలా ఆలస్యమౌతోంది. దీంతో డ్రోన్ల సహాయం తీసుకోవాలని భావించింది.

దూర ప్రయాణ సామర్థ్యం గల డ్రోన్లను అద్దెకు తీసుకుని..వినియోగించుకొనేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈనెల మూడో వారం లేదా..జూన్ మొదటి వారంలో డ్రోన్ల ద్వారా కరోనా మందులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా వికారాబాద్ ప్రాంతంలో ప్రారంభించి..ఆ తర్వాత..ఇతర జిల్లాలకు విస్తరించనుంది. గరిష్టంగా 30 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు టీకాలు, మందులను పంపిణీ చేయనుంది. మొదటి దశలో 7 డ్రోన్లతో 24 రోజుల పాటు ప్రయోగాత్మకంగా రవాణా చేపడుతారు. సాంకేతిక సమస్యలుంటే పరిష్కరిస్తారు.

తెలంగాణలో డ్రోన్ల ద్వారా అత్యవసర కరోనా మందులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రయాణ పరిమితిని తొలగిస్తూ..మరో నిబంధనను సడలించింది. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు కొవిడ్ టీకాలు, మందుల పంపిణీ కోసం డ్రోన్లను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా..మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం గత వారం ఆదేశాలు జారీ చేసింది.

Read More : Cow Urine : గోవు మూత్రం తాగితే కరోనా రాదంటున్న బీజేపీ ఎమ్మెల్యే