Drunken Drive: హైదరాబాద్‌లో ఒక్కరాత్రే 3146కేసులు నమోదు

హైదరాబాద్ లో న్యూ ఇయర్ 2022 వేడుకలు అన్నీ రకాలుగా ముగిశాయి. ఇళ్లల్లో ఉండి పండుగలు జరుపుకోమని చెప్పినా.. కొందరు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఫలితంగా రోడ్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

Drunken Drive: హైదరాబాద్‌లో ఒక్కరాత్రే 3146కేసులు నమోదు

Drunken Drive

Drunken Drive: హైదరాబాద్ లో న్యూ ఇయర్ 2022 వేడుకలు అన్నీ రకాలుగా ముగిశాయి. ఇళ్లల్లో ఉండి పండుగలు జరుపుకోమని చెప్పినా.. కొందరు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఫలితంగా రోడ్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుందని వారిస్తున్నా.. పట్టించుకోవడం లేదు.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డ్రంకన్ డ్రైవ్ చేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. రాత్రి మొత్తం మందుబాబులు చేసిన హడావుడికి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకూ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,258 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదుకాగా పట్టుబడిన వారిలో అత్యధికంగా యువకులే ఉన్నారు.

మూడు కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా నమోదయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు, హైదరాబాద్ పోలిస్ కమీషనర్ రేట్ పరిధిలో 1258 కేసులు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ రేట్ పరిధిలో 1528 కేసులు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: న్యూ ఇయర్ గిఫ్ట్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర