Durgam Cheruvu Cable Bridge : దుర్గం చెరువు అందాలు.. ఈ వీడియో చూశారా?

బ్రిటీష్‌ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళ్లారు. తన కారు వెళ్తున్న సమయంలో ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాల్లో సాయంత్రం వేళ బ్రిడ్జి అందాలు సుందరంగా కనిపించాయి.

Durgam Cheruvu Cable Bridge : దుర్గం చెరువు అందాలు.. ఈ వీడియో చూశారా?

Durgam Cheruvu Cable Bridge

Durgam Cheruvu Cable Bridge :  హైదరాబాద్ అంటే ఇప్పటివరకు చార్మినార్, సైబర్ టవర్స్ గురించే ఎక్కువగా చెప్పుకునేది. పర్యాటకులు కూడా ఈ రెండు ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి కనబరిచేవారు. అయితే ఇప్పుడు వీటిసరసన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి చేరింది. దీనిని చూసేందుకు ప్రతి రోజు వేలసంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఇక వీక్ ఎండ్స్ లో ఈ సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఇక ఈ మధ్య ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు.. ఇతర దేశాలకు చెందిన అధికారులు కూడా దుర్గం చెరువు బ్రిడ్జ్ ని ఓ లుక్కేసి పోతున్నారు.

తాజాగా బ్రిటీష్‌ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళ్లారు. తన కారు వెళ్తున్న సమయంలో ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ దృశ్యాల్లో సాయంత్రం వేళ బ్రిడ్జి అందాలు సుందరంగా కనిపించాయి. కొద్దీ కొద్దిగా చీకటి పడుతున్న సమయంలో ఎదురుగ ఉన్న భవనాలు దుర్గం చెరువు బ్రిడ్జికి కొత్త అందాలు తెచ్చిపెడుతున్నాయి.