Thieves Attacked On CI In PS : నిన్న కానిస్టేబుళ్లపై దాడి..ఈరోజు పోలీస్‌స్టేషన్‌లోనే సీఐపై దాడి

నిన్న కానిస్టేబుళ్లపై దొంగలు దాడి చేసిన కేసులు నిందితులను విచారణకు పిలవగా ఈరోజు పోలీస్‌స్టేషన్‌లోనే సీఐపై నిందుతుల కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు.

Thieves Attacked On CI In PS : నిన్న కానిస్టేబుళ్లపై దాడి..ఈరోజు పోలీస్‌స్టేషన్‌లోనే సీఐపై దాడి

Thieves attacked On CI In PS

Thieves attacked On CI In PS : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దారి దోపిడి దొంగల కేసులో విచారణకు వెళ్లిన ఎస్ఓటీ పోలీసులపై గురువారం (జనవరి 5,2023)దొంగలు దాడి చేశారు. దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈరోజు శుక్రవారం మరికొందరు అనుమానితులు పోలీసులు విచారణ కోసం నార్శింగ్ పీఎస్ కు పిలిపించారు.

దీంతో నిందుతుల కుటుంబ సభ్యులు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే సీఐపై దాడికి యత్నించారు.మమ్మల్ని విచారణకు ఎలా పిలుస్తారు అంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే అంతమంది పోలీసులు చూస్తుండగానే సీఐపై దాడికి యత్నించారు నిందితులు కుటుంబ సభ్యులు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు, నిందితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటం నార్శింగ్ పోలీసు స్టేషన్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Thieves Attacked Police : దారి దోపిడి కేసులో విచారణకు వెళ్లిన పోలీసులు.. కత్తులతో దాడి చేసిన దొంగలు

కాగా రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు వెళ్లగా..ఏకంగా పోలీసులపై దొంగలు దాడి చేశారు. దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కత్తితో పొడిచారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

జనవరి 4న రక్త మైసమ్మ దేవాలయం సమీపంలో బైక్ పై వెళ్తున్న కిషోర్ కుమార్ రెడ్డితో పాటు మరో వ్యక్తిపై దారి దోపిడీ దొంగలు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కిషోర్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో దొంగలు బాధితుడి నుంచి 15 వేల రూపాలయలు చోరీ చేశారు. దొంగల నుంచి తప్పించుకున్న బాధితుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు కోసం వెళ్లిన పోలీసులపైనే దాడి చేశారు.