సభ్య సమాజం సిగ్గు పడే దారుణం.. కూతురిపై కన్నతండ్రి.. చెల్లిపై అన్న అత్యాచారం

ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ భద్రత లేదు. కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రులు, అండగా ఉండాల్సిన తోడబుట్టిన సోదరులు కామాంధుల్లా మారుతున్నారు. అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నారు.

సభ్య సమాజం సిగ్గు పడే దారుణం.. కూతురిపై కన్నతండ్రి.. చెల్లిపై అన్న అత్యాచారం

Father Rapes Minor Daughter

Father Rapes Minor Daughter : ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ భద్రత లేదు. కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రులు, అండగా ఉండాల్సిన తోడబుట్టిన సోదరులు కామాంధుల్లా మారుతున్నారు. అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నారు.

కూతురిపై కన్నతండ్రి లైంగిక దాడి:
తాజాగా మరో దారుణం జరిగింది. కూతురిపై కన్నేసిన కన్నతండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ ఘోరం జరిగింది. కన్నతండ్రే కూతురి(14)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని వయసులో ఆ బాలిక నరకాన్ని అనుభవిస్తూ వచ్చింది. కాగా, బాలిక నిత్యం నీరసంగా ఉంటోంది. ఇది గమనించిన తల్లి గట్టిగా నిలదీయడంతో.. కామాంధుడిగా మారిన కన్నతండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టింది. తనను లైగికంగా ఏ విధంగా వేధిస్తున్నాడో వివరిస్తూ బోరున విలపించింది. విషయం తెలిసి ఆమె షాక్ కి గురైంది. ఆ తర్వాత కామాంధుడైన భర్తకు దేహశుద్ధి చేసింది. వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అన్నయ్యలా నటిస్తూ అత్యాచారం:
ఇలాంటి దారుణమే మరోకటి చోటు చేసుకుంది. దూరపు బంధువు.. చెల్లెలు వరుసయ్యే యువతితో సొంత అన్నయ్యలా నటిస్తూ వచ్చిన ఓ కామాంధుడు ఆమెను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లి ఆరా తీసింది. దీంతో తనపై జరిగిన లైంగిక దాడి గురించి వివరించింది. ఆగ్రహించిన తల్లి ఆ నీచుడిని నిలదీసింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.

రక్త సంబంధానికి మచ్చ:
రక్త సంబంధానికి మచ్చ తెచ్చే ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటున్నాయి. తండ్రి, అన్న, సోదర సమానుల వంటి వారే వావి వరుసలు మరిచి అభంశుభం ఎరుగని బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడుతుండటం బాధాకరం. అయిన వారే కావడం, పైగా ఏం చేస్తారోనన్న భయంతో అటు బయటపడలేక.. ఇటు నరకాన్ని భరించలేక కుమిలిపోవడం బాధితురాళ్ల వంతు అవుతోంది. వేధింపులు తారస్థాయికి చేరిన సందర్భాల్లో ఘోరాలు బయటకు వస్తున్నాయి. సభ్య సమాజం నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.

వారి అసహాయతే అలుసుగా..
ఎదిరించి నిలబడలేనన్న నిస్పృహ, బాధ్యత మరిచిపోతున్న కుటుంబ నేపథ్యాలే పలువురు బాధితురాళ్ల నరకానికి కారణమవుతున్నాయి. మరికొన్ని సంఘటనల్లో మాత్రం కుటుంబ పరువు అనేది నోరు నొక్కేలా చేస్తోంది. బాధను భరించలేక, బెదిరింపుల ‘బంధం’ నుంచి తప్పిచుకోలేక పోతున్న వారిలో 12 నుంచి 18 ఏళ్ల లోపు (మైనర్‌) బాలికలే అధికంగా ఉంటున్నారని గత సంఘటనలను విశ్లేషిస్తే తెలుస్తోంది.

మైనర్లపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్న ఉదంతాలను బట్టి చూస్తే వారి కుటుంబ నేపథ్యం ప్రధాన కారణంగా నిలుస్తోంది. దుర్భర పేదరికంతో పాటు మద్యం వంటి వ్యసనాలకు గురవుతున్న వారే ఈడొచ్చిన బాలికలపై లైంగికదాడులకు తెగబడుతున్నారు. స్కూల్ లేదా కాలేజీ నుంచి డ్రాపౌట్‌ అయి ఇళ్లకే పరిమితం అవుతున్న వారు, లేదా పేదరికంతో బడి గడప తొక్కని బాలికలే సహజంగా ఇంటా, బయటా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఓ సర్వే కూడా తేల్చింది.