Mahabubabad : కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. రైతులపై అటవీ అధికారుల దాడి

మహబూబాబాద్ జిల్లాలో పోడు మంటలు చల్లారడం లేదు. గూడురు మండలం బొల్లేపల్లిలో రైతులపై అటవీ అధికారులు దాడి చేశారు. మిర్చి పంటను పీకేస్తుండటంతో రైతులు వారిని అడ్డుకున్నారు.

Mahabubabad : కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. రైతులపై అటవీ అధికారుల దాడి

Attack

Forest officials attacked farmers : మహబూబాబాద్ జిల్లాలో పోడు మంటలు చల్లారడం లేదు. గూడురు మండలం బొల్లేపల్లిలో రైతులపై అటవీ అధికారులు దాడి చేశారు. మిర్చి పంటను పీకేస్తుండటంతో రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో అటవీ అధికారులు వారిపై దాడికి దిగారు. మిర్చిని పీకేయవద్దని కాళ్లు పట్టుకున్నా అటవీ అధికారులు కనికరించలేదు. స్వయంగా ఎమ్మెల్యే వచ్చి చెప్పినా అటవీ అధికారులు పట్టించుకోలేదు. తమకు జీవనాధారమైన మిర్చితోటను పీకేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో పోడు రైతుల సమస్య అధికమవుతోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా యంత్రాంగం ఎవరూ చెప్పినా ఫారెస్టు అధికారులు, పోడు రైతుల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. గూడూరు మండలం, కొత్తగూడం మండలంలో సమస్య తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గూడూరు మండలంలో లక్షాది రూపాయలు వెచ్చించిన రైతులు వేసుకున్న వరి నాట్లను ఫారెస్టు అధికారులు ధ్వంసం చేసి, రైతులపై దాడులకు తెలబడ్డారు.

CM KCR : పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొద్దు : సీఎం కేసీఆర్

మరోవైపు రాష్ట్రంలోని పోడు రైతులకు రక్షణ కల్పించాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చెప్పారు. కేంద్రంతో కొట్లాడైనా వారికి న్యాయం చేయాల్సివుందన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొద్దని చెప్పారు. తాత, తండ్రుల నుంచి అనాధిగా అడవుల్లో ఉన్న వారిని అక్కడ నుంచి తీసివేయడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. వారి జీవనోపాధిపై దెబ్బ కొట్టడం కూడా కరెక్టు కాదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు లక్షలు కాకుండా మరో ఆరు లేదా ఏడు లక్షల ఎకరాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్నట్లు సమాచారం వస్తుందన్నారు.