Forum For Good Governance : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

వ్యాక్సినేషన్ వల్ల కరోనా తగ్గలేదని జీసస్ వల్లే తగ్గిందని శ్రీనివాసరావు అనడాన్ని సుపరిపాలన వేదిక లేఖలో పేర్కొంది.

Forum For Good Governance : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు

Forum For Good Governance : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు లేఖ రాసింది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావును ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది.

వ్యాక్సినేషన్ వల్ల కరోనా తగ్గలేదని జీసస్ వల్లే తగ్గిందని శ్రీనివాసరావు అనడాన్ని సుపరిపాలన వేదిక లేఖలో పేర్కొంది. చిన్నప్పుడు గాయం తగిలితే వైద్యులను సంప్రదించినా తగ్గలేదని, మసీదులో కట్టిన తాయత్తుతో గాయం వెంటనే మాయమైందన్న శ్రీనివాసరావు వ్యాఖ్యల్ని లేఖలో పొందుపరిచింది.

New Goddess : కొత్త దేవత.. దేవత అవతారమెత్తిన ప్రజాప్రతినిధి.. తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాస్‌ పూజలు

ఆ తాయత్తు మహిమ వల్లే తాను ప్రజారోగ్య సంచాలకుడి స్థాయికి ఎదిగానన్న శ్రీనివాసరావు వ్యాఖ్యలను లేఖలో పేర్కొంది. భద్రాచలంలో పెరిగిన తనపై నక్సలైట్ల ప్రభావం ఎంతో ఉందని తుపాకీ పట్టుకోవాల్సింది పోయి స్టేతస్కోప్ పట్టుకున్నట్లు శ్రీనివాసరావు అనడాన్ని సుపరిపాలన వేదిక ప్రస్తావించింది.

రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు చూస్తున్న శ్రీనివాసరావు తన వ్యాఖ్యల ద్వారా ప్రజల్లో నిలవాలని చూస్తున్నట్లు సుపరిపాలన వేదిక తెలిపింది. బాధ్యత గల హోదాలో ఉండి శ్రీనివాసరావు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మనస్తైర్యం దెబ్బతీస్తున్నారని సుపరిపాలన వేదిక పేర్కొంది.