Terminal Disease Four Died : కరీంనగర్ జిల్లాలో అంతు చిక్కని వ్యాధి.. నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కరీంనగర్ జిల్లా గంగాధరలో మిస్టరీ డెత్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధితో నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు ఒకే విధంగా నలుగురు చనిపోవడం కలకలం రేపుతోంది.

Terminal Disease Four Died : కరీంనగర్ జిల్లాలో అంతు చిక్కని వ్యాధి.. నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

DEAD

Terminal Disease Four Died : కరీంనగర్ జిల్లా గంగాధరలో మిస్టరీ డెత్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధితో నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు ఒకే విధంగా నలుగురు చనిపోవడం కలకలం రేపుతోంది. సుమారు నెలన్నర వ్యవధిలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. నవంబర్ లో 20 నెలల కుమారుడు అద్వైత్ ఆ తర్వాత 12 రోజులకు ఆరేళ్ల కుమార్తె అమూల్య, మరికొద్ది రోజులకు భార్య మమత చనిపోయారు.

కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారని ఇటీవలే ఆవేదన వ్యక్తం చేసిన భర్త శ్రీకాంత్ సైతం ఇప్పుడు చనిపోవడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. రాత్రి ఒక్కసారిగా రక్తం కక్కుకుని పడిపోవడంతో శ్రీకాంత్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే శ్రీకాంత్ చనిపోయాడు. ఇటీవల మృతుల కుటుంబ సభ్యుల రక్త నమూనాలను వైద్య సిబ్బంది సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు. ఇంటి వద్ద బావిలోని నీటిని పరీక్షించామని అందులో తేడా ఏమీ లేదని తేల్చారు.

Rajasthan : రాజస్థాన్‌లో అంతు చిక్కని వ్యాధి.. ఏడుగురు చిన్నారులు మృతి

ఏ కారణంతో చనిపోతున్నారో తెలియడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే వరుస మరణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ సైతం చనిపోవడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భార్యాపిల్లలను కాపాడుకోవడానికి శ్రీకాంత్ లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. మొదట కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లడం, ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లి భార్యాపిల్లలకు వైద్యం చేయించాడు.

అయినా వారు దక్కలేదు. అయిన వాళ్లు చనిపోయారన్న బాధలో ఉండగానే ఇప్పుడు శ్రీకాంత్ మరణంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు సైతం ఆందోళన చెందుతున్నారు. మరి ఒకే కుటుంబంలో ఇలా నెలన్నర వ్యవధిలోనే నలుగురు చనిపోవడం గ్రామస్తులందనీ ఆందోళనకు గురి చేస్తోంది. శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడేమోనని అనుమానిస్తున్నారు.