Safran Hyderabad : హైదరాబాద్‌లో మరో విదేశీ దిగ్గజ సంస్థ భారీ పెట్టుబడి.. ఇండియాలోనే తొలి కేంద్రం

హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ లో భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్ చేశాయి. తాజాగా మరో విదేశీ సంస్థ హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యింది.

Safran Hyderabad : హైదరాబాద్‌లో మరో విదేశీ దిగ్గజ సంస్థ భారీ పెట్టుబడి.. ఇండియాలోనే తొలి కేంద్రం

Safran Hyderabad

Safran Hyderabad : హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ లో భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్ చేశాయి. తాజాగా మరో విదేశీ సంస్థ హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారు చేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్(SAFRAN) తన కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

15 కోట్ల డాలర్లతో (రూ.1200 కోట్లు) ఎంఆర్ఓ (MRO-మెయింటైన్స్, రిపేర్, ఓవర్ హాల్) కేంద్రాన్ని శాఫ్రాన్ ఏర్పాటు చేయనుంది. ఇది విమాన ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రం. ఇండియాలో తన తొలి ఎంఆర్ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకోవాలనుకున్న శాఫ్రాన్ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఇక శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం ఇదేనన్న కేటీఆర్.. మన దేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనని ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ పెట్టుబడి, రూ.20వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న అమెజాన్

ఈ కేంద్రం ఏర్పాటుతో సుమారు వెయ్యి మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. భారత్ తో పాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే ఇంజిన్లను హైదరాబాద్ లోనే చేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోవైపు ఈ భారీ పెట్టుబడితో హైదరాబాద్ కు తిరుగులేదన్న సంగతి మరోసారి రుజువైందని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.