Petrol price in hyderabad: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. ఒక్క హైదరాబాద్‌లోనే..

పెట్రోల్, డీజిల్ ధరల మోత మళ్లీ ప్రారంభమైంది. గత పదిహేను రోజులుగా నిలకడగా ఉన్న పెట్రో, డీజిల్ ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. అయితే ఈ ధరలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే పెరగడం గమనార్హం. దేశంలోని...

Petrol price in hyderabad: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. ఒక్క హైదరాబాద్‌లోనే..

Petrol Price

Petrol price in hyderabad: పెట్రోల్, డీజిల్ ధరల మోత మళ్లీ ప్రారంభమైంది. గత పదిహేను రోజులుగా నిలకడగా ఉన్న పెట్రో, డీజిల్ ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. అయితే ఈ ధరలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే పెరగడం గమనార్హం. దేశంలోని మిగిలిన నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమంటూ ఉడటంతో ఇక మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. కార్యాలయాలకు, ఇతర పనులకు బయటకు వెళ్లాలంటే సొంత వాహనాలను వదిలి ఆర్టీసీ, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి.

PETROL PRICES INCREASED: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్ పై 45, డీజిల్ పై 43పైసలు పెంపు

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర గురువారం 119.49గా ఉంది. అయితే శుక్రవారం రూ. 119.66కి చేరింది. అంటే పెట్రోల్ ధర రూ. 17 పైసలు పెరిగింది. ఇక డీజిల్ హైదరాబాద్‌లో 105.49 ఉండగా శుక్రవారం 105.65కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్న కారణంగానే ధరలు పెంచినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొంటున్నాయి. గ్లోబల్ మార్కెట్ లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్ 109 డాలర్లుగా నమోదైంది. డబ్ల్యూటీఐ బ్యారల్ కు రూ. 107.4 డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో మళ్లీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

PETROL PRICES INCREASED: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్ పై 45, డీజిల్ పై 43పైసలు పెంపు

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో, డీజిల్ ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41 కాగా, డీజిల్ ధర 96.67గా ఉంది. చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ. 110.85, లీటర్ డీజిల్ ధర రూ. 100.94గా ఉంది. ముంబై, కోల్ కతాతో పాటు ఇతర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉన్పప్పటికీ ఒక్క హైదరాబాద్ లోనే ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 120 నుంచి రూ. 120.30కి చేరగా, లీటర్ డీజిల్ రూ. 105.65 నుంచి రూ. 105.93కు పెరిగింది.