TG Corona : జీహెచ్ఎంసీలో కరోనా ఉధృతి..ఖాళీగా కోవిడ్ కంట్రోల్ రూమ్, పట్టించుకోని అధికారులు!

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‌ టెన్షన్‌ పెట్టిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కోవిడ్ నివారణకు ఆయా సంస్థలు తీసుకోవాల్సి చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం ఓవైపు చెబుతుంటే.. జీహెచ్ఎంసీ మాత్రం అందుకు తగ్గట్లుగా పనిచేయడం లేదు.

TG Corona : జీహెచ్ఎంసీలో కరోనా ఉధృతి..ఖాళీగా కోవిడ్ కంట్రోల్ రూమ్, పట్టించుకోని అధికారులు!

Ghmc Covid

Ghmc Covid Control Room : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‌ టెన్షన్‌ పెట్టిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కోవిడ్ నివారణకు ఆయా సంస్థలు తీసుకోవాల్సి చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం ఓవైపు చెబుతుంటే.. జీహెచ్ఎంసీ మాత్రం అందుకు తగ్గట్లుగా పనిచేయడం లేదు. గత ఏడాది కరోనా కట్టడికి కంటైన్‌మెంట్ల ఏర్పాటు.. ఆయా ప్రాంతాల్లో శానిటైజేషన్‌.. అక్కడి కుటుంబాల అవసరాలు తీర్చేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రతి కరోనా రోగికి ఇంటికే మందులు కూడా అందించారు. అంతే కాదు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు.

ఇప్పుడు మాత్రం కరోనా కట్టడిలో.. బల్దియా తమ పాత్ర ఏం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి అవసరమైనచోట మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ.. అవి ఎక్కడా సిటీలో అమలవడం లేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కేసులు ఎక్కవగా నమోదవుతూ.. హాట్ స్పాట్స్‌గా ఉండగా అక్కడ కూడా ఎలాంటి నియంత్రణ చర్యలు కనిపించడం లేదు. లక్షణాలు లేని వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుండగా.. అక్కడ ఎలాంటి శానిటైజ్ కార్యక్రమాలు చేయట్లేదు జీహెచ్‌ఎంసీ. రెగ్యులర్‌గా వస్తున్న కేసుల వివరాలు కూడా బల్దియా అధికారులు తమకు తెలియదంటున్నారు.

మాస్క్ తప్పనిసరి చేసి.. పాటించని వారికి ఫైన్లు కూడా వేయాలని సర్కార్ ఆదేశాలిచ్చినా అవేమీ పట్టించుకోవట్లేదు బల్దియా అధికారులు. వ్యాపార కేంద్రాలు.. మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున పబ్లిక్‌ కోవిడ్ జాగ్రత్తలు లేకుండా తిరుగుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్‌ కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తోంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు, అత్యవసర అవసరాల కోసం ఏర్పాటుచేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ ఖాళీగా దర్శనమిస్తోంది.

నగరంలో కోవిడ్‌ వేగంగా వ్యాపిస్తున్నా.. జీహెచ్‌ఎంసీ మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. కోవిడ్ బారినపడిన రోగులు ఫోన్ చేస్తే ఎత్తే వారు కరవయ్యారు. ఎప్పుడు చూసినా.. కోవిడ్ కంట్రోల్ రూమ్‌ ఖాళీగానే దర్శనమిస్తోందట. డ్యూటీలో షిఫ్టుల వారిగా ముగ్గురు హెల్త్ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా.. డ్యూటీలో ఒకరు మాత్రమే ఉంటున్నారు. దీంతో నగరవాసులు అసహనానికి గురవుతున్నారు. కనీసం కోవిడ్ రోగుల ఫిర్యాదులు స్వీకరించి.. సలహాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు సిటిజన్స్.