బల్దియా పోరు : నామినేషన్ల జోరు..ఒక్కరోజే సమయం

  • Published By: madhu ,Published On : November 19, 2020 / 11:55 PM IST
బల్దియా పోరు : నామినేషన్ల జోరు..ఒక్కరోజే సమయం

ghmc Election Nomination : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. నగరంలోని అన్ని డివిజన్లలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తుండటంతో.. ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసి.. ప్రచారంలోకి దిగుతున్నారు. రెండు రోజుల్లో మొత్తం 537మంది అభ్యర్థులు 597 నామినేషన్లు వేశారు.



గురువారం మంచి రోజు : – 
ఇక గురువారం మంచిరోజు కావడంతో.. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు . సీట్లు ఫైనల్‌ కాకున్నా.. ఒక సెట్ నామినేషన్ వేసేశారు కొంతమంది అభ్యర్థులు. మరిన్ని సర్కిళ్లలో ఆశావాహులు కూడా తమ నామినేషన్లు ఫైల్ చేశారు. పార్టీలో అసంతృప్తులుగా ఉన్నవారు రెబల్, ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు.



టీఆర్ఎస్ నుంచి అత్యధికం: – 

రెండు రోజుల్లో కలిపి మొత్తం 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 195 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీజేపీ నుంచి 140 మంది, సీపీఐ నుంచి ఒకరు, సీపీఎం నుంచి నలుగురు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ నుంచి 68 మంది, ఎంఐఎం నుంచి 27 మంది, టీడీపీ నుంచి 47 మంది, వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి ఒకరు, రికగ్‌నైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 15 మంది నామినేషన్లు వేశారు. స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు.



శుక్రవారం మధ్యాహ్నం 03 గంటల వరకు : – 

ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే మరికొన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. చివరి రోజు మరింతగా నామినేషన్లు వచ్చే అవశాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ కేంద్రాలకు చేరుకున్న వారికి మాత్రమే నామినేషన్లు వేసే ఛాన్స్‌ ఉంటుంది.