Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత నాలుగు రోజులుగా ప్రతీరోజూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు చెరువులను తలపిస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..

Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత నాలుగు రోజులుగా ప్రతీరోజూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు చెరువులను తలపిస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారంసైతం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇదిలాఉంటే తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

CM KCR: జాతీయ పార్టీ ఏర్పాట్లలో వేగం పెంచిన సీఎం కేసీఆర్.. రేపు యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

నేడు నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

శుక్రవారం రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపిన వాతావరణ శాఖ.. శనివారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.