CM KCR: జాతీయ పార్టీ ఏర్పాట్లలో వేగం పెంచిన సీఎం కేసీఆర్.. రేపు యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

సీఎం కేసీఆర్ రేపు ఉదయం 11గంటలకు యాదాద్రికి వెళ్లనున్నారు. వచ్చే నెల5న జాతీయ పార్టీని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొంటారు. అదేవిధంగా వచ్చేనెల 5న సిద్దిపేట జిల్లా కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. అక్కడకూడా ప్రత్యేక పూజలు చేయనున్నారు.

CM KCR: జాతీయ పార్టీ ఏర్పాట్లలో వేగం పెంచిన సీఎం కేసీఆర్.. రేపు యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

CM KCR

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాట్లలో వేగం పెంచారు. వచ్చే నెల 5న దసరా పండుగ రోజున కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారని తెలుస్తోంది. అదేరోజు పార్టీ పేరును వెల్లడించనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు ముందు అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేయనున్నారు. అయితే, ప్రస్తుతం సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి ఏ పేరు పెడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం నాలుగు పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ ముఖ్యుల నుంచి నాలుగు పేర్లలో ఏ పేరుపెడితే బాగుంటుందని సీఎం కేసీఆర్ అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాల మేరకు ముందుగా అనుకున్నట్లుగానే భారతీయ రాష్ట్ర సమితి పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Ktr slams NDA government: మిషన్ భగీరథకు జాతీయ అవార్డు.. కేంద్రంపై వ్యంగ్యంగా స్పందించిన కేటీఆర్

ఈనెల 5న సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని, పార్టీ పేరును ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇందుకోసం జాతీయ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే రేపు ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. జాతీయ పార్టీ ప్రకటించే ముందు లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొంటారు. జాతీయ పార్టీ పేరును ప్రకటించే రోజు ఉదయం సిద్దిపేట జిల్లా కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. అక్కడ కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాటానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. బీజేపీయేతర పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నూతన పార్టీని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే కేసీఆర్ పేర్కొన్నారు. ఆ మేరకు వేగంగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. వచ్చే నెల5న జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర సీఎంలతో భేటీ అవుతున్న కేసీఆర్.. బీహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం దేవగౌడ, గుజరాత్ మాజీ సీఎం శంకర్‌ సింఘ్‌వాఘేలాతో కేసీఆర్ భేటీ అయ్యారు. వీరితో భేటీలో జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై చర్చించినట్లు తెలిసింది.