Amit Shah..’Washing Powder Nirma’ : ‘వాషింగ్ పౌడర్ నిర్మా’యాడ్‌తో అమిత్‌షాకు స్వాగ‌తం..!

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ కు ‘వాషింగ్ పౌడర్ నిర్మా’తో స్వాగతం పలికిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి హోమ్ మంత్రిపై సెటైర్లు వేస్తూ కొంతమంది హైదరాబాద్ లో లు ‘వాషింగ్ పౌడర్ నిర్మా’తో స్వాగతం పలికినట్లుగా ఏర్పాటు చేసిన పోస్టర్లను ఏర్పాటు చేశారు.

Amit Shah..’Washing Powder Nirma’ :  ‘వాషింగ్ పౌడర్ నిర్మా’యాడ్‌తో అమిత్‌షాకు స్వాగ‌తం..!

Amit Shah..'Washing Powder Nirma'

Amit Shah..’Washing Powder Nirma’ : కేంద్ర హోమ్ మంత్రి అమిత్ కు ‘వాషింగ్ పౌడర్ నిర్మా’తో స్వాగతం పలికిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి హోమ్ మంత్రిపై సెటైర్లు వేస్తూ కొంతమంది హైదరాబాద్ లో లు ‘వాషింగ్ పౌడర్ నిర్మా’తో స్వాగతం పలికినట్లుగా ఏర్పాటు చేసిన పోస్టర్లను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో ఈడి విచారించిన క్రమంలో హైదరాబాద్ లో కొంతమంది ఇటువంటి పోస్టర్లను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో జరిగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 54వ ఆవిర్భావ దినోత్సవ పరేడ్ కు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్ర‌మంలోనే అమిత్ షాను వాషింగ్ పౌడర్ నిర్మా పోస్ట‌ర్ తో స్వాగ‌తం ప‌లుకుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కవితను ఈడీ విచారించటం దేశ రాజ‌కీయాలను హీటెక్కించింది. బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఘాటు వ్యాఖ్యలలో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీకి వ్య‌తిరేకంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో బ్యాన‌ర్లు, పోస్ట‌ర్లు వెలిశాయి. బీజేపీ అగ్ర‌నేత‌లు టార్గెట్ చేస్తూ సెటైరికల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు కొందరు. బహుశా వీటిని బీఆర్ఎస్ కార్యకర్తలే ఏర్పాటు చేశారని సమాచారం. వాషింగ్ పౌడ‌ర్ నిర్మా యాడ్ తో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షాకు బీఆర్ఎస్ స్వాగతం ప‌లటంతో తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి.

వాషింగ్ పౌడ‌ర్ నిర్మా యాడ్ లోక‌నిపించే పాప ఫొటో ముఖంలో బీజేపీలోకి మారినవారితో పాటు వివిధ కేసుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న బీజేపీ నేతల ఫోటోలు ఉండటంతో ఇక బీజేపీకీ, బీఆర్ఎస్ కు మధ్య పోరు మరింత తీవ్రకానుందని తెలుస్తోంది. పోస్ట్‌లో బీజేపీ నేత నారాయణ్ రాణే, సువేందు అధికారి, సుజనాచౌదరి, జ్యోతిరాదిత్య సింధియా, ఈశ్వరప్ప సహా పలువురు నేతల ముఖాలను ఏర్పాటు చేశారు. నిర్మా సర్ఫ్‌తో బట్టలపై మరకలు మాయమై పోయినట్లు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరితే వారికి అంటిన మరకలు కూడా పోతాయనే అర్థం ఈ పోస్టర్ల ద్వారా సెటైర్ వేసినట్లుగా తెలుస్తోంది.

ఎందుకంటే ఈడీ, సీబీఐ దాడులతో బీజేపీ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసిందని..అలా భయపడితే బెదిరిపోయిన బీజేపీలో చేరతానని ఇది బీజేపీ కుట్ర అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కేసులు ఉన్న నేతలు బీజేపీలో చేరితే ఇక ఆకేసులు మాఫీ అయిపోతాయని బీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధింస్తున్నారు. ఇటువంటి దాడులతో బీజేపీ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈక్రమంలోనే వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ తో అమిత్ షాకు స్వాగతం పలికినట్లుగా వినూత్నంగా ఈ పోస్టర్లను బీఆర్ఎస్ నేతలే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా..బీజేపీలో చేరగానే కేసులు మాయమంటూ.. ఇటీవల బీజేపీలో చేరిన పలువురి ఫొటోలను ప్రదర్శించారు. బీజేపీలో చేరితే అవినీతి మరకలు కాషాయంలోకి మారిపోతాయని.. అలాగే కవిత ఫొటోపై అసలైన రంగుల వెలసిపోవు అంటూ పోస్టర్లు అంటించారు. ఇలా రాజకీయాల్లో ఎదుటి పార్టీని విమర్శించటానికి..ఎద్దేవా చేయటానికి ఇలా వినూత్నంగా ఆలోచిస్తున్నారు రాజకీయనేతలు.