Fingerprint Surgeries Crime : హైదరాబాద్‌లో వేలిముద్ర సర్జరీలు చేస్తున్న ముఠా .. డాక్టర్ తో పాటు నలుగురు అరెస్ట్

హైదరాబాదులో మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. గల్ఫ్ దేశాలకు వెళ్లటానికి రిజక్ట్ అయితే మళ్లీ వెళ్లేందుకు కొంతమంది పక్కదారులు పడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లటానికి ‘వేలిముద్రలు’తప్పనిసరి. దీంతో ఒకసారి రిజక్ట్ అయితే మరోసారి వెళ్లేందుకు ఏకంగా ‘వేలిముద్రలు’ సర్జీరీలు చేయించుకోవటం చేస్తున్నారు. దీనికోసం ముఠాగా ఏర్పడి ఇటువంటి పనులు చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఏడాదిపాటు వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా ఈ వేలిముద్రలు సర్జరీలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో.

Fingerprint Surgeries Crime : హైదరాబాద్‌లో వేలిముద్ర సర్జరీలు చేస్తున్న ముఠా .. డాక్టర్ తో పాటు నలుగురు అరెస్ట్

Fingerprint Surgeries Crime in Hyderabad

Fingerprint Surgeries Crime in Hyderabad : హైదరాబాదులో మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. గల్ఫ్ దేశాలకు వెళ్లటానికి రిజక్ట్ అయితే మళ్లీ వెళ్లేందుకు కొంతమంది పక్కదారులు పడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లటానికి ‘వేలిముద్రలు’తప్పనిసరి. దీంతో ఒకసారి రిజక్ట్ అయితే మరోసారి వెళ్లేందుకు ఏకంగా ‘వేలిముద్రలు’ సర్జీరీలు చేయించుకోవటం చేస్తున్నారు. దీనికోసం ముఠాగా ఏర్పడి ఇటువంటి పనులు చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఏడాదిపాటు వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా ఈ వేలిముద్రలు సర్జరీలు జరుగుతున్నాయి హైదరాబాద్ నగరంలో. అలా వేలిముద్రలు సర్జరీలు చేయించుకుని..రిజెక్ట్ అయిన తరువాత కూడా దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళ్లుతున్నారు యువకులు. హైదరాబాద్ లో ఇటువంటి సర్జరీలు చేస్తున్న ఓ డాక్టర్ తో పాటు నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు రిజెక్ట్ అయిన వారికి వేలిముద్రల సర్జరీలు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు తప్పనిసరి కావడంతో, గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి ప్రయత్నం చేసి రిజెక్ట్ అయిన యువకులు చాలా మంది..వేలిముద్రలను మార్చుకోవడం కోసం, వేలి ముద్రల క్లోనింగ్ సర్జరీలను చేయించుకుంటున్నారు. ఈ సర్జరీలతో మళ్లీ గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. వేలిముద్రలు మార్పు చేసుకొని, తప్పుడు వివరాలతో సర్జరీ తర్వాత గల్ఫ్ దేశాలకు దొడ్డిదారిన వెళ్తున్న యువకులకు సర్జరీలు చేస్తున్న డాక్టర్ తో పాటు మరి కొంత మంది సిబ్బందిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

నగరంలో ఫింగర్‌ ప్రింట్‌ సర్జరీ ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు . గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రల వల్ల అవకాశం లేని యువకులకు కొత్త తరహాలో మోసం చేసేందుకు ఈ ముఠా సర్జరీలు చేసే వైద్యులతో ఒప్పందం చేసుకుంది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు తప్పనిసరి. అయితే ఒకసారి రిజక్ట్‌ అయిన యువకులు వేలిముద్రల క్లోనింగ్ సర్జరీలతోమళ్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సంవత్సరం పాటు వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా కొత్త రకం సర్జరీ చేస్తున్నట్లు సమాచారం.

సర్జరీ తర్వాత దొడ్డిదారిన గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. యువకులకు వేలిముద్రల సర్జరీ చేస్తున్న డాక్టర్‌తో పాటు కొంత మంది సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కొత్త తరహా వేలిముద్రల సర్జరీ ద్వారా ఏడాదిపాటు వేలిముద్రలు కనిపించకుండా ఉంటాయి. ఏకంగా ప్రభుత్వాలనే మోసం చేస్తూ వేలిముద్రల సర్జరీతో ఇతర దేశాలకు వెళుతున్న క్రమంలో నగరంలోని ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇంతకు ముందు వేలిముద్రల క్లోనింగ్ తో బ్యాంకు లావాదేవీలలో డబ్బులు కొల్లగొట్టిన నేరగాళ్ళు కూడా ఉన్నారు. కాగా..గల్ఫ్ దేశాల్లో ఒక్క దినార్ కు రూ.250లు పైనే భారత్ కరెన్సీ ఉండటంతో ఎంతోమంది ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారు.